రైతులకు నాణ్యమైన ఎరువులు అందించడమే తెదేపా లక్ష్యం : ఎమ్మెల్యే కోట్ల
1 min read

ప్యాపిలి, న్యూస్ నేడు : రైతులకు నాణ్యమైన ఎరువులు అందించడమే తెదేపా లక్ష్యం అని డోన్ శాసనసభ సభ్యులు కోట్ల జయ సూర్య ప్రకాశ్ రెడ్డి,ఉమ్మడి కర్నూలు జిల్లా డిసిఎంఎస్ చైర్మన్ వై. నాగేశ్వరావు యాదవ్ అన్నారు. డోన్ నియోజకవర్గ శాసనసభ్యులు కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డి డీసీఎంఎస్ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా శుక్రవారం ఎమ్మెల్యే కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డి, ఉమ్మడి కర్నూలు జిల్లా డిసిఎంఎస్ చైర్మన్ నాగేశ్వరావు యాదవ్ చేతుల మీదుగా రైతులకు యూరియా మరియు డిఏపి పంపిణీ చేశారు. ఎంఆర్పి రేట్లకు ఎరువుల పంపిణీ చేయాలని, మరియు రైతులకు ఎరువులు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో తేదేపా సీనీయర్ నాయకులు లక్కసాగరం లక్ష్మిరెడ్డి,మాజీ ఎంపిపి శ్రీనివాసులు, ఎద్దులదొడ్డి ప్రభాకర్ రెడ్డి, తేదేపా నాయకులు చండ్రుపల్లి లక్ష్మీనారాయణ యాదవ్ నాగేంద్ర, రామ్మోహన్, ఖాజాఫిర్, ఎస్ కే వలీ, డిసిఎంఎస్ జిల్లా మెనేజర్ రాజేష్ కుమార్, బ్రాంచ్ మేనేజర్లు. శారణ్య, షేక్ వలి శివరంజని, రామిరెడ్డి రైతులు తదితరులు పాల్గొన్నారు.


