భాగవతం అమృత భాండం…
1 min read

డాక్టర్ మల్లు వేంకట రెడ్డి, తితిదే.
నందికుంటలో ఘనంగా ముగిసిన తితిదే ధార్మిక కార్యక్రమాలు
కర్నూలు, న్యూస్ నేడు: భాగవతం మనిషికి అమృతత్వాన్ని ప్రసాదించే ఒక అమృత భాండమని, జీవితాన్ని ఎలా ఆనందమయంగా మలుచుకోవాలో నేర్పుతుందని, సృష్టిలోని అన్ని విషయాలు భాగవతం చదవడం వలన, వినడం వలన తెలుసుకోవచ్చునని తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్తు ఉమ్మడి కర్నూలు జిల్లా శాఖ కార్యనిర్వాహకులు డాక్టర్ మల్లు వేంకట రెడ్డి అన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్తు ఉమ్మడి కర్నూలు జిల్లా శాఖ ఆధ్వర్యంలో కొత్తపల్లి మండలం, నందికుంట గ్రామంలోని పురాతన నందీశ్వరాలయం నందు గత నాలుగు రోజులుగా నిర్వహిస్తున్న ధార్మిక, ఆధ్యాత్మిక, సంస్కృతిక కార్యక్రమాల ముగింపు సందర్భంగా గోపూజ మరియు కుంకుమార్చన కార్యక్రమాలానంతరం జరిగిన ధార్మిక సభలో వారు ప్రసంగించారు. గత మూడు రోజులపాటు ఇస్కాన్ ధర్మ ప్రచారకులు కీర్తి రాజదాసు శ్రీమద్రామాయణం, మహాభారతం, భగవద్గీతలపై చేసిన ప్రవచనాలు భక్తులను ఎంతగానో అలరించాయి. అర్చకులు బాణాల లక్ష్మీనారాయణాచార్యులు మాతృమూర్తులందరితో గోపూజ, కుంకుమార్చన చేయించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పైరెడ్డి నిత్యలక్ష్మి, నారాయణరెడ్డి, గ్రామ పెద్దలు టి.మధుసూదన రెడ్డి, స్థానిక భజన బృందం సభ్యులు నారాయణ, శివన్న, పుల్లయ్య, దత్తు శివన్న, మహేష్, ప్రవీణ్, హేమంత్ సాయి, బాణ రామిరెడ్డితో పాటు స్థానిక భక్తులు పాల్గొన్నారు. ప్రతిరోజు కార్యక్రమాల ప్రారంభానికి ముందుగా గ్రామంలో హరినామ సంకీర్తన నిర్వహించారు.

