NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

నూతనంగా ఎన్నికైన బిజెపి రాష్ట్ర అధ్యక్షులుగా పివిఎన్ మాధవ్

1 min read

హొళగుంద న్యూస్ నేడు : నూతనంగా ఎన్నికైన భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ .పి.వి.ఎన్ మాధవ్  మొదటిసారిగా రాష్ట్ర పర్యటనలో భాగంగా ఈనెల 29వ తేదీన కర్నూలు పర్యటనకు వస్తున్న సందర్భంగా ఈరోజు హోళగుంద మండలంలోని ఈర్లకట్ట దగ్గర ఉన్న ఉరవకొండ మఠంలో భారతీయ జనతా పార్టీ మండల సమావేశం ఏర్పాటు చేశారు, ఈ సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుని  పర్యటనను విజయవంతం చేయవలసిందిగా  క్రియాశీలక సభ్యులును, శక్తి కేంద్ర  ఇన్చార్జిలును, బూత్ కమిటీ అధ్యక్షులను, మరియు పార్టీ కార్యకర్తను మీడియా సమావేశంలో పిలుపునివ్వడం జరిగింది.  ఈ కార్యక్రమము బిజెపి మండల అధ్యక్షురాలు ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిల్ నెంబర్ చిదానంద, మాజీ మండల అధ్యక్షుడు ఏ.ఈ.ఎన్​  .ప్రసాద్, జనరల్ సెక్రెటరీ మహేష్ ఉలిగన్న, సీనియర్ లీడర్ జక్కన్న చారి, కాశీ విశ్వనాథ్ గౌడ్, శివరాజ్, బసవ, మళ్ళీ, ప్రేమవర్ధన్ రెడ్డి, బెన కప్ప, రామానుజన్ రెడ్డి, వెంకట్ రెడ్డి, రాజా తదితర బిజెపి కార్యకర్తలు రకార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

About Author