NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

బిజేపీ రాష్ట్ర అధ్యక్షుడి పర్యటన విజయవంతం చేద్దాం..

1 min read

నందికొట్కూరు, న్యూస్​ నేడు:  రాష్ట్ర బిజేపీ అధ్యక్షుడిగా నూతనంగా బాధ్యతలు చేపట్టిన పీవీఎన్ మాధవ్ ఈనెల 28వ తేదీన నంద్యాలకు వస్తున్న సందర్భంగా పర్యటనను విజయవంతం చేయాలని నందికొట్కూరు బిజెపి అసెంబ్లీ కోఆర్డినేటర్ చల్లా దామోదర్ రెడ్డి అన్నారు.శనివారం నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలోని బిజెపి కార్యాలయంలో పట్టణ అధ్యక్షులు వడ్డె వేణుగోపాల్ అసెంబ్లీ కో ఆర్డినేటర్ దామోదర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో పార్టీ బలోపేతమే ధ్యేయంగారాష్ట్ర వ్యాప్త పర్యటనకు శ్రీకారం చుట్టారు.మొదటిసారిగా నంద్యాలకు వస్తున్న మాధవ్ పర్యటన విజయవంతం చేయాలని బిజెపి నాయకులు కార్యకర్తలను కోరారు.ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా నాయకులు గూడూరు రవికుమార్ రెడ్డి,జల్లు మధు,నాగేంద్ర,చంద్రశేఖర్,ఈశ్వర ప్రసాద్,శ్రీకాంత్ రావు,కృష్ణ యాదవ్,రాజ్ కుమార్ , సురేష్,రాజశేఖర్,మధు కుమార్ పాల్గొన్నారు.

About Author