65 సం।। దాటిన కార్డుదారులకు ఇంటి వద్దనే రేషన్ డెలివరీ
1 min read

కర్నూలు, న్యూస్ నేడు: కర్నూలు జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీమతి నవ్య శనివారం వీకర్ సెక్షన్ కాలనీ నందలి 65 సంవత్సరములు దాటిన కార్డుదారులకు ఇంటి వద్దనే రేషన్ డెలివరీ చేయించారు.కర్నూలు జిల్లాలో 46283 మంది కార్డుదారులు 65 సంవత్సరములు పైబడిన వారు ఉన్నారు. ఈరోజుకి దాదాపుగా 10000 (21%) మంది 65 ఏండ్లు పైబడిన కార్డుదారులకు జిల్లా వ్యాప్తంగా ఇంటి వద్దనే రేషన్ సరుకులు అందజేయడమైనది.జాయింట్ కలెక్టర్ 65 ఏళ్లు దాటిన కార్డుదారులు విచారణ చేసిన సమయంలో వాళ్లు ఇంటి వద్దనే సరుకులు పంపిణీ చేయడంతో సంతృప్తి వ్యక్తం చేసినారు..రేషన్ షాపుల వద్దకు వెళ్లి q లో నిలబడి గంటల పాటు వేచి చూసి సరుకులు తీసుకోవలసిన ఇబ్బందులు తొలగిపోయినట్లుగా తెలిపినారు.

