NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఈఎన్​టి విద్యార్థులు మెళకువలు నేర్చుకోవాలి

1 min read

ఏఓఐ కర్నూలు జిల్లా అధ్యక్షుడు డా. జయ ప్రకాశ్​ రెడ్డి

కర్నూలు హాస్పిటల్​ , న్యూస్​ నేడు:  ప్రస్తుత కాలుష్య వాతావరణంలో  సంచరిస్తూ …సైనస్​ సమస్యతో అవస్థలు పడుతున్న వారి సంఖ్య అధికమయ్యిందన్నారు  అసోసిసియేషన్​ ఆఫ్​ ఓటోలరింగాలజిస్ట్​ ఆఫ్​ ఇండియా ( ఏఓఐ) కర్నూలు బ్రాంచ్​ అధ్యక్షుడు డా. జయ ప్రకాశ్​ రెడ్డి.  కర్నూలు సర్వజన ఆస్పత్రిలోని ఈఎన్​టి డిపార్ట్​ మెంట్​ లో  వైస్​ ప్రిన్సిపల్​ డా. సాయి సుధీర్​ నేతృత్వంలో బుధవారం కేఎంసీ, విమ్స్​ , నంద్యాల శాంతి రాం మెడికల్​ కాలేజి ఈఎన్​టి  మెడికల్​ విద్యార్థులకు సర్జరీ, వ్యాధి గుర్తింపు, చికిత్స తదితర అంశాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఏఓఐ కర్నూలు జిల్లా అధ్యక్షుడు డా. జయ ప్రకాశ్​ రెడ్డి మాట్లాడారు. ముక్కు గాలి కుహరాలలో  బ్యాక్టిరియా ఇన్​ ఫెక్షన్​ అయి ఉంటే ఎలా చికిత్స చేయాలి, అలాగే నోరు, చెవి నొప్పితో వచ్చిన వారికి ఎలాంటి చికిత్స చేయాలి, సర్జరీ తదితర అంశాలపై స్పష్టంగా వివరించారు. అదేవిధంగా ప్రాక్టికల్ కూడా విద్యార్థులతో చేయించారు.  కార్యక్రమంలో  అసోసిసియేషన్​ ఆఫ్​ ఓటోలరింగాలజిస్ట్​ ఆఫ్​ ఇండియా ( ఏఓఐ) కర్నూలు  జిల్లా  సెక్రటరి డా. మహేంద్ర,  ప్రొఫెసర్లు ​ మునీరుద్దీన్​ ,  సి.వెంకటేశ్వర రావు, ఈఎన్​టి హెచ్​ ఓడి, జీజీహెచ్​ కర్నూలు డా. హరి కృష్ణ తదితరులు ఈఎన్​టి విద్యార్థులకు చికిత్స విధానం, వ్యాధి గుర్తింపు తదితర అంశాలపై వెల్లడించారు.   

About Author