NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఎమ్మిగనూరు బీసీ, ఎస్సీ హాస్టల్లలో తీవ్ర సమస్యలు

1 min read

అంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న సంక్షేమ హాస్టళ్ల బాట కార్యక్రమంలో బాగంగా ఎమ్మిగనూరు బీసీ, ఎస్సీ హాస్టల్స్‌లో తీవ్ర సమస్యలు – తక్షణం స్పందన కోరుతున్న విద్యార్థి విభాగం నియోజకవర్గ అధ్యక్షులు బాలరాం యాదవ్

ఎమ్మిగనూరు న్యూస్ నేడు:  పట్టణంలో మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న సంక్షేమ హాస్టళ్ల బాట కార్యక్రమం బాగంగా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మిగనూరు నియోజకవర్గ ఇంచార్జ్,మాజీ పార్లమెంట్ సభ్యురాలు శ్రీమతి బుట్టా రేణుక  ఆదేశాల మేరకు, విద్యార్థి విభాగం నాయకులు ఎమ్మిగనూరు పట్టణంలోని బీసీ మరియు ఎస్సీ హాస్టల్స్‌ను సందర్శించారు. హాస్టల్స్‌లో విద్యార్థులు ఎదుర్కొంటున్న దుర్భరమైన పరిస్థితులపై స్వయంగా పరిశీలన జరిపారు. పార్టీ పట్ల, విద్యార్థుల పట్ల ఉన్న బాధ్యతతో హాస్టల్స్‌ను సందర్శించిన ఈ బృందం, అక్కడి విద్యార్థుల వాస్తవ జీవితాన్ని తెలుసుకుని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.ఈ సందర్శనలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం నియోజకవర్గ అధ్యక్షులు బాలరాం యాదవ్, జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రకాష్ రెడ్డి, పట్టణ అధ్యక్షులు పి. ఉస్సేన్, గొనెగండ్ల మండల నాయకులు సీను, నందవరం మండల నాయకులు విజయ్, నియోజకవర్గ ప్రచార విభాగ అధ్యక్షులు చాంద్ భాష, నియోజకవర్గ సోషల్ మీడియా విభాగ అధ్యక్షులు మరియు సభ్యులు జశ్వంత్ ల పాల్గొన్నారు. నాయకుల బృందం విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలు నేరుగా తెలుసుకున్నారు.ప్రస్తుతం హాస్టల్స్‌లో పరిస్థితి అత్యంత దురదృష్టకరం. 230 మంది విద్యార్థులకు గాను కేవలం ఇద్దరు వర్కర్లు మాత్రమే విధుల్లో ఉన్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం కనీసం ఆరుగురు వర్కర్లు ఉండాల్సి ఉంటుంది. ఈ లోపం కారణంగా హాస్టల్ నిర్వహణ పూర్తిగా జారిపోయినట్టైంది. మరుగుదొడ్లకు డోర్లు లేకుండా ఉండటం, వాటిలో చెత్తచెదారం పేరుకుపోవడం, రోజువారీ శుభ్రత నిర్వహణ లేకపోవడం విద్యార్థులను తీవ్ర అసౌకర్యానికి గురిచేస్తోంది.విద్యార్థి విభాగ నాయకులు ఈ సమస్యలను తక్షణమే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి, పరిష్కారం సాధించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. విద్యార్థుల హక్కుల పరిరక్షణకు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరంతరం కృషి చేస్తుందని, ఈ విధమైన నిర్లక్ష్య పాలనకు వ్యతిరేకంగా ప్రజల్లో చైతన్యం పెంచే కార్యక్రమాలు చేపడతామని స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం విద్యార్థుల సంక్షేమాన్ని పూర్తిగా తాకట్టు పెట్టిందని, వైయస్ జగన్ పాలనలో అందిన సౌకర్యాలు ఇప్పుడు కనుమరుగైపోయాయన్నది అందరికీ స్పష్టమవుతోందన్నారు.

About Author