అన్నదాత సుఖీభవను ప్రారంభించిన ఎమ్మెల్యే
1 min read

పత్తికొండ, న్యూస్ నేడు: పత్తికొండ నియోజకవర్గంలోని చక్రాల గ్రామంలో శనివారం స్థానిక ఎమ్మెల్యే కేఈ శ్యాం కుమార్ అన్నదాత సుఖీభవ పథకం ను ప్రారంభించారు. పత్తికొండ ఎమ్మెల్యే కే ఈ శ్యామ్ కుమార్. అన్నదాత సుఖీభవ పథకం లబ్ధిదారులు చక్రాల రైతు సేవ కేంద్రం ఆవరణలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఫోటోలకు రైతులు ఎమ్మెల్యే ఆధ్వర్యంలో పాలాభిషేకం చేశారు. పిఎం కిసాన్ లబ్ధిదారులకు ఎమ్మెల్యే చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కే ఈ శ్యామ్ కుమార్ మాట్లాడుతూ, ఆరుగాలం కష్టపడే అన్నదాతలకు కూటమి ప్రభుత్వం ఎప్పుడు అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. రైతుల కళ్ళల్లో ఆనందం వెల్లివిరిసిందని, ఎన్నికలలో ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం నెరవేరుస్తుందని అన్నారు. సూపర్ సిక్స్ పథకాలలో భాగంగా అత్యంత కీలకమైన అన్నదాత సుఖీభవ పథకం కింద మొదటి విడతగా రాష్ట్ర ప్రభుత్వం వాటా 5000 రూపాయలు కేంద్రం వాట 2000 రూపాయల కలుపుకుని రైతుల అకౌంట్లో ₹7,000 జమ చేస్తున్నామని తెలిపారు. పత్తికొండ నియోజకవర్గం లో 54 వేల 774 మంది రైతులకు27.387 కోట్ల రూపాయలను ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. గత వైసిపి ప్రభుత్వంలో రైతులను నట్టేట ముంచారని, కానీ కూటమి ప్రభుత్వం రైతులకు ఎప్పుడు అండగా ఉంటుందన్నారు. వైసీపీ ప్రభుత్వంలో రైతులకు వ్యవసాయ పనిముట్లు, డ్రిప్ పరికరాలు అందజేయకుండా నిర్లక్ష్యం చేసిందన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన ఏడాదిలోపే రైతులకు వ్యవసాయ పనిముట్లు డ్రిప్ పరికరాలు సబ్సిడీ కింద అందజేశామన్నారు. ఈనెల 15వ తేదీన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తున్నామన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఏడాదిలోపే ఇచ్చిన హామీలు అమలు చేశామన్నారు.


