క్రిస్టియన్ నన్స్ లను తక్షణమే విడుదల చేయాలి
1 min read

ఢిల్లీలో డిసెంబర్ 23న జంతర్ మంతర్లో పెద్ద ఎత్తున ధర్నా నిర్వహిస్తాం
నేషనల్ దళిత జేఏసీ చైర్మన్ పెరికె వరప్రసాదరావు డిమాండ్
ఏలూరు జిల్లా ప్రతినిధి న్యూస్ నేడు : ఛత్తీస్‌గఢ్ జైల్లో ఉన్న క్రిస్టియన్ నన్స్ లను తక్షణమే విడుదల చేయాలి లేదంటే ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద 23న దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ధర్నా నిర్వహిస్తామని నేషనల్ దళిత జేఏసీ చైర్మన్ పెరికె వరప్రసాదరావు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం స్థానిక కోర్ట్ సెంటర్ తన ఛాంబర్ లో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
ఛత్తీస్‌గఢ్‌లో మానవ అక్రమ రవాణా, బలవంతపు మత మార్పిడి ఆరోపణలపై ఇద్దరు కాథలిక్ నన్స్‌లను అరెస్టు చేయడం ‘రాజ్యాంగ విరుద్ధమే కాక చట్టవిరుద్ధం’ వారిని వెంటనే విడుద చేయాలని నేషనల్ దళిత జేఏసీ చైర్మన్ పెరికె వరప్రసాదరావు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఛత్తీస్‌గఢ్‌లోని దుర్గ్ సెంట్రల్ జైలులో కేరళకు చెందిన ఇద్దరు నన్స్‌ను అరెస్టు చేసి నిర్బంధించడం దుర్మార్గపు చర్యని తీవ్రంగా ఆగ్రహించారు ఆ రాష్ట్ర సర్కారు దిగివచ్చింది.వారిని కలిసేందుకు అనుమతించింది. ”ఇది దేశంలోని క్రైస్తవులను లక్ష్యంగా చేసుకున్న దాడి” ఛత్తీస్‌గఢ్‌లోని దుర్గ్ రైల్వే స్టేషన్‌లో నన్స్ ప్రీతి మెర్రీ, వందన ఫ్రాన్సిస్‌లతో పాటు సుకమాన్ మాండవిని ప్రభుత్వ రైల్వే పోలీసులు (జీఆర్పీ) అరెస్టు చేశారు. స్థానిక భజరంగ్ దళ్ కార్యకర్త ఫిర్యాదు మేరకు నన్స్‌ను అదుపులోకి తీసుకున్నట్టు వారు తెలిపారు.
ఛత్తీస్‌గఢ్‌లోని గిరిజన ప్రాబల్యం ఉన్న నారాయణపూర్ జిల్లాకు చెందిన ముగ్గురు మహిళలను బలవంతంగా మతమార్పిడి చేసి అక్రమంగా రవాణా చేస్తున్నారని తప్పుడు ఫిర్యాదులతో ఆరోపించారు. ”మేం విన్న, చూసిన దాంతో తీవ్రంగా కలత చెందాం. కల్పిత కేసు ఆధారంగా, ఇద్దరు నన్స్‌ను అరెస్టు చేశారని పెరికె వరప్రసాదరావు అన్నారు. ఏండ్ల తరబడి పేదలకు సేవ చేస్తున్న ఇద్దరు నన్స్‌ను కక్షసాధింపు చర్యల్లో భాగంగానే బీజేపీ సర్కార్ జైలుకు పంపిందని వెల్లడించారు. ప్రస్తుతం వారు జ్వరం, ఆర్థరైటిస్‌తో బాధపడుతున్నారు. అయినప్పటికీ వారిని నేలపైనే పడుకోబెట్టారు.
దేశంలో ఏం జరుగుతోంది.
ఈ చర్య చట్టవిరుద్ధమే కాద, రాజ్యాంగ విరుద్ధం కూడా. ఇది దేశంలోని క్రైస్తవులే లక్ష్యంగా చేస్తున్న దాడి. ప్రాథమిక మానవ విలువలను సైతం తుంగలో తొక్కుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చట్టబద్ధమైన పాలనకు బదులుగా గూండాల పాలన కొనసాగుతోందని నేషనల్ దళిత జేఏసీ చైర్మన్ పెరికె వర ప్రసాదరావు దుయ్యబట్టారు. అమాయకుడైన ఓ గిరిజన వ్యక్తిని సైతం అరెస్టు చేశారని తెలిపారు. గిరిజనుల శ్రేయోభిలాషులమని చెప్పుకునే బీజేపీ సర్కార్ గిరిజనుడిపై దాడికి పాల్పడటం సిగ్గుచేటని అన్నారు. వారిపై మోపిన మానవ అక్రమ రవాణా, మతమార్పిడి ఆరోపణలను పెరికె వరప్రసాదరావు తిరస్కరించారు. భారతీయ పౌరులకు దేశంలో ఎక్కడికైనా ప్రయాణించడానికి, ఉపాధి పొందేందుకు హక్కు ఉంది. దేశంలోని మైనారిటీలపై దాడి చేయడం హిందూత్వ ఎజెండా అయినందువల్లే వారిపై అక్రమ రవాణా ఆరోపణను మోపారు. వారిపై చేసిన ఆరోపణలన్నీ నిరాధారమైనవని నేషనల్ దళిత జేఏసీ చైర్మన్ వర ప్రసాద రావు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జేఏసీ కేరళ అధ్యక్షులు కొలనూరు షాజీ, ఎన్జీవో కొలకలూరి ప్రభ, బహుజన స్టూడెంట్ ఫెడరేషన్ ఏపీ అధ్యక్షులు కొండపల్లి శ్రీనివాస్ పాల్గొన్నారు.

