స్మార్ట్ మీటర్లు రద్దు చేయాలని ధర్నా…
1 min read

హొళగుంద న్యూస్ నేడు: హొళగుంద మండల కేంద్రంలోని ఏపీఎస్పీడీసీఎల్ కరెంట్ ఆఫీస్ నందు స్మార్ట్ మీటర్లు రద్దు చేయాలని ట్రూ అప్పు చార్జీలు తగ్గించాలని ధర్నా చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి మారెప్ప సిపిఎం మండల కార్యదర్శి వెంకటేష్ ఏఐటీయూసీ తాలూకా ఉపాధ్యక్షులు కే రంగన్న ఐఎఫ్టియు మండల కార్యదర్శి సవరప్ప ఇతర ప్రజాసంఘాల నాయకులు మాట్లాడుతూ పాల్గొనడం స్మార్ట్ మీటర్ల పెట్టడాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని. అలాగే సెకీ ఒప్పందాన్ని రద్దు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న చంద్రబాబు నాయుడు అని ప్రచారం చేసి ఓట్లు దండుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత కుటమి ప్రభుత్వం జగన్ తీసుకొచ్చినటువంటి గత ప్రభుత్వ విధానాన్ని ఆ ప్రభుత్వం కన్నా అతివేగంగా కూటమి ప్రభుత్వమే అతివేగంగా అమలు చేయడం చాలా అని అన్నారు 44% విద్యుత్ చార్జీల ప్రజలకు బారాన్ని మోపారని అలాగే ప్రజలు కళ్ళుగప్పి స్మార్ట్ మీటర్లు బిగింపుకు పూనుకున్నారని ముందుగా డబ్బులు చెల్లించి కరెంటు వాడకాన్ని రహస్యంగా తీసుకువస్తున్నారు అని ఇప్పటికే జిల్లాలో అనేక చోట్ల ఏజెన్సీలను పెట్టి ఈ స్మార్ట్ మీటర్లను బిగిస్తా ఉన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విధానాలు కార్పొరేట్లకు మేలు చేసే చర్యలు వల్ల ప్రజల పై పెనుబారం పడుతుందని వారు ఆరోపించారు కావున కూటమి ప్రభుత్వం తక్షణమే స్మార్ట్ మీటర్లు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని లేకపోతే ఈ విద్యుత్ ఉద్యమాన్ని గత బషీరాబగ్ ఉద్యమంగా రాష్ట్రవ్యాప్తంగా ఉద్రిక్తంగా చేస్తామని వారు హెచ్చరించారు ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకుడు ఎస్ కృష్ణయ్య సలాం సమ్మత గిరి కేసప్ప బాలయ్య కాలింగ రామంజి వీరభద్ర వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.


