పట్టాలు ఇస్తామని మాట ఇచ్చాం… నిలబెట్టుకుంటున్నాం..
1 min read
సూపర్ సిక్స్ పథకాలు కూడా అమలు చేస్తున్నాం…
పరిశ్రమలు, వాణిజ్యం మరియు ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టి జి భరత్…
కర్నూలు, న్యూస్ నేడు : మంత్రి నారా లోకేష్ యువ గళం పాదయాత్ర సందర్భంగా ఇచ్చిన మాట ప్రకారం గూడెం కొట్టాల వారికి పట్టాలు పంపిణీ చేస్తున్నామని పరిశ్రమలు, వాణిజ్యం మరియు ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టి.జి.భరత్ పేర్కొన్నారు.మంగళవారం సాయంకాలం అశోక్ నగర్ నగరపాలక సంస్థ పంప్ హౌస్ ప్రాంతంలో గూడెం కొట్టాల లో అత్యంత ఖరీదైన ఒక ఎకరం స్థలంలో 150 మందికి జీవో ఎంఎస్ నెంబర్:30 ప్రకారం ఇళ్ల పట్టాలను ప్రస్తుతం రెవెన్యూ శాఖ తరపున ఇస్తున్నామని ఆ తరువాత రిజిస్టర్డ్ పట్టాలను వారి పేరు మీద అందజేస్తామని మంత్రి టి.జి.భరత్ తెలియజేశారు. రాష్ట్రంలో ఈ జీవో నెంబర్ 30 ని జనవరి 2025 నెలలో ఇచ్చిన ప్రకారం మొదటి సారి మంత్రి నారా లోకేష్ నియోజకవర్గం మంగళగిరి లో ఇళ్ల పట్టాలు ఇవ్వడం జరిగిందని, రెండవ సారి కర్నూలులో ఇళ్ల పట్టాలు ఇచ్చి రికార్డ్ సృష్టించడం జరిగిందని మంత్రి తెలియజేశారు.దీనిని ఇంత త్వరగా కార్యరూపంలో పెట్టడం వెనక కర్నూలు జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా, జాయింట్ కలెక్టర్ బి.నవ్య,ఆర్డిఓ తహసీల్దార్ ల కృషి ఉన్నదని వారికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నారని తెలిపారు. ఇప్పుడు మీకు కాలువలు, కరెంటు ట్రాన్స్ఫార్మర్లు, కరెంటు స్తంభాలు, రోడ్లు మున్సిపాలిటీ వారి ద్వారా ఏర్పాటు చేస్తామని మంత్రి తెలియజేశారు. ప్రజలు గత ప్రభుత్వ హయాంలో ఐదు సంవత్సరాలు చాలా కష్టాలు, నష్టాలు అనుభవించారని దానిని గుర్తుపెట్టుకుని 164 సీట్లతో మా ప్రభుత్వాము ఏర్పాటుకు మద్దతు ఇచ్చి వారికి బుద్ధి చెప్పారని తెలియజేశారు. ప్రజలకు ఇచ్చిన వాగ్ధానాల మేరకు సూపర్ సిక్స్ పథకాలు కూడా అమలు చేస్తున్నామని తెలిపారు. ఇందులో భాగంగా ఆగస్టు 15న మహిళలందరికీ రాష్ట్రమంతా తిరగే వెసులు బాటుతో ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తున్నామని మంత్రి తెలియజేశారు. టిడ్కో గృహాలను ఈ సంవత్సరం చివరకు ప్రజలకు అందుబాటులోకి తీసుకొని వస్తామని, జగన్నాథ్ గట్టు లో గల ఇండ్లను కూడా అందుబాటులోకి తెస్తామని, అలాగే టీవీ9 కాలనీ ఇండ్లు మరియు కర్నూలు నగరంలో చాలా సంవత్సరాలుగా నివాసాలు ఉంటున్న వారికి ఇళ్ల పట్టాలు మంజూరు చేస్తామని ఈ సందర్భంగా మంత్రి టి.జి. భరత్ తెలియజేశారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా మాట్లాడుతూ మంత్రి భరత్ గారు జీవో 30 వచ్చినప్పటినుండి ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తూ 40 సంవత్సరముల నుండి నివాసం ఉంటున్న గూడెం కొట్టాల వాసులకు ఈ సంవత్సరం జనవరి లో ఇచ్చిన జీవో 30 ప్రకారం వారికి ఇళ్లపట్టాలను అందించే చర్యలు చేపట్టేందుకు తీవ్రంగా కృషిచేసి మాకు అన్ని విధాల సహకరించి ఈరోజు 150 మందికి ఇళ్ల పట్టాలను మంజూరు చేయించారని రేపటినుండి ఆ స్థలాలు మీ సొంతమని జిల్లా కలెక్టర్ లబ్ధిదారులకు తెలియజేశారు.ఈ సమావేశాన్ని ఉద్దేశించి జాయింట్ కలెక్టర్ డా.బి.నవ్య మాట్లాడుతూ జీవో నెంబర్ 30 ప్రకారం గూడెం కొట్టాలలో 150 మందికి ప్రస్తుతం రెవెన్యూ పట్టాలు ఇస్తున్నామని ఆ తర్వాత రిజిస్టర్ పట్టాలు అందజేస్తామని తెలియజేశారు.ఈ సందర్భంగా లబ్ధిదారులు మక్తుమ్ బీ మరియు హుస్సేన్ బీ మాట్లాడుతూ…మేము గత 40 సంవత్సరాలు నుండి ప్రతి ప్రజా ప్రతినిధిని ఇళ్ల పట్టాలు ఇవ్వండి అని వేడుకున్నాము కానీ ఎవరు మాకు న్యాయం చేయలేదు. యువగళం పాదయాత్ర సందర్భంగా నారా లోకేష్ వాగ్దానం చేశారు, ఇప్పుడు మంత్రి టి. జి.భరత్ గారు మరియు అధికారులు మాకు న్యాయం చేశారని మంత్రికి, అధికారులకు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సందర్భంగా 150 మందికి మంత్రి అధికారుల చేతులు మీదుగా ఇళ్ల పట్టాలను పంపిణీ చేయడం జరిగింది.ఈ సమావేశానికి ఆర్డిఓ సందీప్ కుమార్, కల్లూరు తహసీల్దారు ఆంజనేయులు, మున్సిపల్ కార్పొరేషన్ హెల్త్ ఆఫీసర్ విశ్వేశ్వర్ రెడ్డి, స్థానిక నాయకులు గూడెం రాజశేఖర్, మనోజ్ ప్రజలు పాల్గొన్నారు.


