NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

వాట్సాప్ గవర్నెన్స్ సద్వినియోగం చేసుకోండి

1 min read

మహానంది, న్యూస్​ నేడు : ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా అమలు చేస్తున్న వాట్సాప్ గవర్నెన్స్ సద్వినియోగం చేసుకోవాలని మహానంది మండల ఏవో నాగేశ్వర్ రెడ్డి తో పాటు బొల్లవరం గ్రామ పంచాయతీ కార్యదర్శి నాగ కాంత మంగళవారం పిలుపునిచ్చారు. గ్రామంలో గ్రామస్తుల మధ్య వాట్సాప్ గవర్నెన్స్ కార్యక్రమాన్ని గ్రామస్తులకు వివరించారు. పలు రకాల సేవలు వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా పొందవచ్చని సూచించారు. ఇంటి వద్ద నుండే వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ఆదాయ, కుల, ధ్రువీకరణ పతరాలతో పాటు జనన, మరణ, ఇతర పత్రాల కొరకు కూడా దరఖాస్తు చేసుకుని వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా పొందవచ్చని గ్రామస్తులకు సృష్టించారు. ఎక్కడ ఏ ప్రాంతంలో ఏ రాష్ట్రంలో ఉన్నా కూడా ఏపీ వాసులు దరఖాస్తు చేసుకొని ధ్రువీకరణ పత్రాలు పొందే అవకాశం ఉంది అన్నారు. ఈ ధ్రువీకరణ పత్రాల కోసం దరఖాస్తు చేసే ముందు సంబంధిత అన్ని పత్రాలు వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా తెలియజేయాల్సి ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ సిబ్బందితోపాటు పలువురు గ్రామస్తులు పాల్గొన్నారు.

About Author