రోడ్డు ప్రమాదంలో లారీ డ్రైవర్ మృతి నివాళులు అర్పించిన యూనియన్ నాయకులు
1 min read

డోన్ , న్యూస్ నేడు: డోన్ పట్టణం ఇందిరానగర్ కు చెందిన లారీ డ్రైవర్ షేక్ నూర్ భాష (54) శనివారం పేరంటాలమ్మ గుడి సమీపంలో జరిగిన బైకు ప్రమాదంలో మృతి చెందాడు.ఆయన మృతికి ప్రముఖ న్యాయవాది ఎం.నాగభూషణం రెడ్డి,డోన్ మోటార్ వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి టి.శివరాం సంతాపం వ్యక్తం చేశారు.ఆదివారం జరిగిన మృతుని అంత్యక్రియల్లో పాల్గొన్న వారు స్థానిక ఇందిరానగర్ లోని మృతుని స్వగృహం నందు ఆయన భౌతిక కాయానికి నివాళులు అర్పించారు.కుటుంబ సభ్యులను పరామర్శించారు.నూర్ భాష అకాల మరణం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు.మృతునికి భార్య ఒక కుమారుడు నలుగురు కుమార్తెలు.డ్రైవర్లు నాగరాజు,మీసాల శ్రీను,తోక రామాంజనేయులు,మద్దిలేటి,మధు,రమణ,తిరుపాలు,మోదిన్,మైకు రాజా,మద్దిలేటి,రంగడు,ప్రైవేటు స్కూల్ బస్సు వర్కర్స్ యూనియన్ నాయకులు మహేష్,వెంకటేశ్వర్లు తదితరులు నివాళులు అర్పించారు.టి.శివరాం ప్రధాన కార్యదర్శి డోన్ మోటార్ వర్కర్స్ యూనియన్ డోన్.

