NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

విద్యార్థులు చదువుకున్న పాఠశాల అభివృద్ధికి కృషి చేయాలి

1 min read

జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా

కర్నూలు, న్యూస్​ నేడు : భవిష్యత్ లో విద్యార్థులు ఎక్కడ స్థిరపడిన తము చదువుకున్న పాఠశాల అభివృద్ధికి కృషి చేయాలని జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా తెలిపారు.ఆదివారం ఓర్వకల్లు మండలం కాల్వ బుగ్గ ఏ. పి.రెసిడెన్షియల్ స్కూల్ ను  కలెక్టర్ సందర్శించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మనం చదివిన పాఠశాల నుండి ఏ స్థాయిలో స్థిరపడినం, ఆ విధంగా స్థిరపడాలంటే ఏ విధంగా చదవాలి అని చెప్పేందుకు ఇటువంటి రోజు చాలా ఉపయోగపడుతుందన్నారు.. అప్పటి  సమయంలో పాఠశాలలో కాంపౌండ్  ఉండేది కాదని తను పంచాయతీ రాజ్ డైరెక్టగా గా ఉన్న సమయంలో 50 లక్షల రూపాయలతో కాంపౌండ్ వాల్ నిర్మించడం జరిగిందన్నారు… అదే విధంగా ఇంటర్నల్ రోడ్ల నిర్మాణం కొరకు 15 లక్షల రూపాయలను శాంక్షన్ చేయడం జరిగిందన్నారు..అదే విధంగా సిల్వర్ జూబ్లీ కళాశాల కి సంబంధించిన ప్లే గ్రౌండ్ కొరకు 33 లక్షల రూపాయలను శాంక్షన్ చేయడం జరిగిందన్నారు.పీఎం శ్రీ కింద 14 కోట్ల రూపాయలతో ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేయడం జరుగుతుందన్నారు. అందులో 12 కోట్ల రూపాయల పనులను కూడా పూర్తి చేయడం జరిగిందన్నారు..సాంఘిక సంక్షేమ వసతి గృహాలు అన్ని కూడ మరమతుల కొరకు 8 కోట్ల రూపాయలను శాంక్షన్ చేయడంతో పాటు 90 శాతం పనులు కూడా పూర్తయ్యాయి అన్నారు..  అదే విధంగా బీసీ సంక్షేమ గృహాల మరమ్మతులకు ఎంపీ లాడ్స్ కింద కోటి రూపాయలు,  డి ఎం ఎఫ్ కింద 50 లక్షల రూపాయలను శాంక్షన్ చేయడం జరిగిందన్నారు..ఇక్కడ ఉన్న ప్లే గ్రౌండ్ కి సంబంధించిన లెవెలింగ్ పనులకు 30 లక్షల నిధులను మంజూరు చేయడం జరిగిందన్నారు.. అదే విధంగా ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో సోలార్ రూఫ్ ఏర్పాటు చేయడంలో భాగంగా మొదటగా ఈ పాఠశాలలోనే 26 లక్షల రూపాయలతో సోలార్ రూఫ్ ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు.. గ్రీన్ కో కంపెనీ వారి ఆధ్వర్యంలో  జగన్నాథ గట్టు వద్ద క్రికెట్ స్టేడియం ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు.. ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో పేటెంట్ ల కొరకు వచ్చిన అటెండెంట్ కొరకు హాల్ ను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు..జిల్లాలో పి 4 పాలసీ కింద గుర్తించిన బంగారు కుటుంబాలను కూడా దత్తత తీసుకునే ప్రక్రియ దాదాపు పూర్తి  అయిందన్నారు…  బనావసి ఏపీ రెసిడెన్షియల్ పాఠశాలలో ఇంటర్నల్ రోడ్లు , మరమ్మతులు పనులు కూడా చేయించడం జరుగుతుందన్నారు.  ఈ పాఠశాలలో విద్యను అభ్యసించిన సందర్భంగా తన సహ విద్యార్ధులు, టీచర్లు, ఉపాధ్యాయులతో సమావేశం అయి, అప్పటి జ్ఞాపకాలను, అనుభవాలను కలెక్టర్ గుర్తు చేసుకున్నారు.. అనంతరం ఆ పాఠశాలలో వివిధ రంగాల్లో ప్రతిభ  సాధించిన విద్యార్థులకు ప్రశంసా పత్రాలు, ప్రోత్సాహక బహుమతులను కలెక్టర్ అందచేశారు.కార్యక్రమంలో డిఈఓ శామ్యూల్ పాల్, తదితరులు పాల్గొన్నారు.

About Author