14వ తేదీ లోపు పంట క్రాఫ్ ఇన్సూరెన్స్ చెల్లించాలి..
1 min read

మండల వ్యవసాయ అధికారి షేక్షావలి..
నందికొట్కూరు, న్యూస్ నేడు: ఈనెల 14వ తేదీ లోపు మొక్కజొన్న పంట క్రాఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియం నగదు చెల్లించాలనిమొక్కజొన్న పంటలపై పురుగు ఏ విధంగా వస్తుందనే వాటి గురించి నందికొట్కూరు మండల వ్యవసాయ అధికారి షేక్షావలి రైతులకు అవగాహన కల్పించారు.నంద్యాల జిల్లా నందికొట్కూరు మండల పరిధిలోని వడ్డెమాను, కోనేటమ్మ పల్లె గ్రామాల్లో బుధవారం పొలం పిలుస్తోంది అనే కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి వ్యవసాయ మరియు అనుబంధ శాఖల అధికారులు మరియు నాచురల్ ఫార్మింగ్ సిబ్బంది హాజరయ్యారు.మొక్కజొన్న పంటలో కాండంతో పురుగు నివారణకు సస్య రక్షణ పద్ధతులు సస్యరక్షణ మరియుకాండం తొలుచు పురుగు నివారణ చర్యలు ఏ విధంగా తీసుకోవాలనే వాటి గురించిపిల్ల పురుగులు ఆకులపై పత్ర హరితాన్ని గోకి తింటుంది ఆ తర్వాత కాండం లోపలికి చేరి ఆకులపై వరుస క్రమంలో పొడవాటి చిల్లులు కనిపిస్తాయని ఏవో రైతులతో అన్నారు.కత్తెర పురుగు:మొదటి దశ గొంగళి పురుగు ఆకులపై పత్ర హరితాన్ని గోకితింటూ ఆకులపై రంద్రాలు చేస్తుంది ఇటువంటి రంధ్రాలు ఆకులపై నిలువుగా కనిపిస్తాయి గొంగళి పురుగు పెరిగే కొద్దీ ఆకుల చివరల నుండి తింటూ ఆకులను కత్తిరించినట్టుగా కనిపిస్తూ ఆకులను పూర్తిగా తినివేయుట గమనించవచ్చని ఆకు సుడులను మరియు కాండాన్ని కూడా తొలిచి రంధ్రాలు చేసి పంటను నష్టపరుస్తుంది కంకి మరియు లేత కండలను కూడా నష్టపరుస్తుందని రైతులకు అవగాహన కల్పించారు.వర్షాలకు మొక్కజొన్న పంటను కాపాడుకోవాలంటే పొలంలో ఉన్న వర్షపు నీటిని బయటకు వెళ్లే విధంగా చూడాలని పొలాలకు ఎరువులను వేసుకుంటే పంట అధిక దిగుబడి వస్తుందని రైతులకు ఏఓ సూచించారు.

