ఖరీఫ్ పంటలకు పంట నమోదు తప్పనిసరి..
1 min read

మండల వ్యవసాయ అధికారి పీరు నాయక్..
మిడుతూరు (నందికొట్కూరు) న్యూస్ నేడు : ఖరీఫ్ లో సాగు చేస్తున్న పంటలకు తప్పనిసరిగా పట్టణము రోజు చేసుకోవాలని మిడుతూరు మండల వ్యవసాయ అధికారి ఎం.పీరు నాయక్ రైతులతో అన్నారు.నంద్యాల జిల్లా మిడుతూరు మండల పరిధిలోని చింతలపల్లె, దేవనూరు గ్రామాల్లో”పొలం పిలుస్తోంది”అనే కార్యాక్రమం నిర్వహించారు.పంటలు వేసుకున్న రైతులు పంట నమోదు చేసుకోవాలని అదేవిధంగా మొక్కజొన్న, కంది పంటల యాజమాన్యాల గురించి అలాగే పత్తి పంటలో రసం పీల్చే పరుగుల ఉధృతి గురుంచి ఏవో రైతులకు వివరించారు.ఖరీఫ్ లో వేసిన పంటలకు క్రాఫ్ ఇన్సూరెన్స్(పి ఎంఎఫ్ బివై)ఈరోజు గురువారంతో ముగుస్తుందని అలాగే వాటి వల్ల కలిగే ప్రయోజనాల గురించి వివరించారు.అన్నదాత సుఖీభవ నగదు జమకాని రైతులు ఆయా రైతు సేవా కేంద్రాల్లో గ్రీవెన్స్ లో పేర్లు నమోదు చేసుకోగలరని ఏఓ పీరు నాయక్ రైతులకు వివరించారు.ఈ కార్యక్రమంలో ఏఈవోలు అశోక్,మల్లికార్జున రెడ్డి,ఆర్ఎస్ కే సిబ్బంది మరియు రైతులు పాల్గొన్నారు.

