ఎద్దుల బండ్లు,ట్రాక్టర్లతో భారీగా ర్యాలీ..
1 min read

16 లక్షలతో సిమెంట్ రోడ్లు ప్రారంభోత్సవం
పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితా రెడ్డి..
ఓర్వకల్లు , న్యూస్ నేడు : అన్నదాత సుఖీభవ నగదు రావడంతో రైతుల కళ్ళల్లో ఆనందం చూస్తున్నామని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితా రెడ్డి అన్నారు.కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండల పరిధిలోని హుశేనాపురం గ్రామంలో బుధవారం”అన్నదాత సుఖీభవ పథకం”కింద కేంద్ర ప్రభుత్వం 2వేలు,రాష్ట్ర ప్రభుత్వం 5వేలు కలిపి మొత్తం 7వేలు రైతుల అకౌంట్ల లో జమ అయినందుకు గాను ముఖ్యమంత్రి చంద్రబాబుకు కృతజ్ఞతగా గ్రామంలో ఎద్దుల బండ్లుట్రాక్టర్లతో భారీ ర్యాలీ నిర్వహించారు.ఈ ర్యాలీలో ఎమ్మెల్యేతో పాటుగా నంద్యాల జిల్లా టీడీపీ అధ్యక్షులు మరియు టీటీడీ బోర్డు సభ్యులు మల్లెల రాజశేఖర్ తదితర నాయకులు రైతులు భారీగా పాల్గొన్నారు. ముందుగా ఎన్ హెచ్ హైవే రహదారి నుండి గ్రామంలో ఎద్దుల బండ్లు మరియు ట్రాక్టర్లతో చేపట్టిన ర్యాలీలో మహిళలు అధిక సంఖ్యలో ర్యాలీలో ఉత్సాహంగా పాల్గొంటూ కార్యక్రమం విజయవంతం చేశారు. అదేవిధంగా గ్రామంలో ఉపాధి హామీ పథకం కింద నూతనంగా వేసిన 16 లక్షలతో రెండు సిమెంట్ రోడ్ల శిలా ఫలకాలను ఎమ్మెల్యే ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ టీడీపీ రైతుల సంక్షేమ అభివృద్ధిని కోరుకుంటుందని చెప్పిన మాట ప్రకారం మాట తప్పకుండా ప్రభుత్వం హామీలను నెరవేరుస్తుందని అన్నారు.చంద్రబాబు సారథ్యంలోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని రైతు సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. అంతే కాకుండా రాబోయే రోజుల్లో మరిన్ని పథకాలు మీ ముందుకు తీసుకు రావడం జరుగుతుందని రాబోయే రోజుల్లో ప్రభుత్వాన్ని ఆశీర్వదించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఎమ్మెల్యే అన్నారు.ఈ కార్యక్రమంలో డీఈ నాగిరెడ్డి,ఎంపీడీవో శ్రీనివాసులు,తహసిల్దార్ బీవీఎన్ విద్యాసాగర్,ఏఈ సురేంద్ర నాథ్ రెడ్డి,గ్రామ సర్పంచ్ గోవర్ధనమ్మ,చంద్ర పెద్ద స్వామి,మహబూబ్ బాష తదితరులు పాల్గొన్నారు.


