ఎక్సైజ్ ఇన్స్పెక్టర్లతో నెల వారి నేర సమీక్ష
1 min read

కర్నూలు, న్యూస్ నేడు: కర్నూలు జిల్లా డిప్యూటీ కమిషనర్ ఆఫ్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శ్రీమతి పి శ్రీదేవి తన కార్యాలయం లో కర్నూలు మరియు నంద్యాల జిల్లాలోని ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్లతో నెల వారి నేర సమీక్ష నిర్వహించారు ఇందులో నాటుసారాయి సమూలంగా నిర్మూలించడానికి ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన నవోదయం 2.0 లో గ్రామాలలోని నాటు సారాయి ను పూర్తిగా నిర్ములించి ఆగష్టు నెలాఖరు లోపు కర్నూలు జిల్లా ను నాటు సారా రహిత జిల్లా గా ప్రకటించడానికి అవసరమైన చర్యలను తీసుకోవాలని ఆదేశించారు. మద్యం షాప్ లకు అనుబందంగా పర్మిట్ షాప్ లకు ప్రభుత్వం అనుమతి ఇచ్చినందున పర్మిట్ రూమ్ ల రిటైల్ ఎక్సయిస్ టాక్స్ ను చెల్లించ్చేటట్లు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మద్యం బార్ ల పాలసీ ఈ నెలాఖరు కు ముగుస్తున్నందున కొత్త బార్ ల పాలసీ నోటిఫికేషన్ త్వరలో రానున్నందున ఆసక్తి కల వ్యాపారులకు పాలసీ గురించి తెలిపి ఎక్కువ ధరకాస్థులు వచ్చే విదంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. .ఈ రివ్యూ లో అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శ్రీ రావిపాటి హనుమంతరావు కర్నూలు జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి శ్రీ మచ్చ సుధీర్ బాబు , నంద్యాల జిల్లా ఎక్సైజ్ అధికారి శ్రీ రవికుమార్ ,అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ లు శ్రీ డి రామకృష్ణారెడ్డి, వి .రాముడు మరియు శ్రీ. రాజశేఖర్ గౌడ్ లు గ మరియు కర్నూలు మరియు నంద్యాల జిల్లా ఎక్సైజ్ ఇన్స్పెక్టర్లు అందరూ పాల్గొన్నారు.

