అక్రమ వెంచర్లపై చర్యలు తీసుకోండి..
1 min read

మున్సిపాలిటీ కమిషనర్ కు సీపీఐ నాయకుల వినతి..
నందికొట్కూరు, న్యూస్ నేడు: నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలో అక్రమ వెంచర్లపై చర్యలు తీసుకోవాలని బుధవారం సీపీఐ జిల్లా నాయకులు రఘురాం మూర్తి,సీపీఐ పట్టణ కార్యదర్శి శ్రీనివాసులు నందికొట్కూరు మున్సిపాలిటీ కమిషనర్ ఎస్.బేభిని కోరారు.నందికొట్కూరు పట్టణంలో దాదాపు 21 చోట్ల 220 ఎకరాల్లో నిబంధనలకు విరుద్ధంగా వ్యవసాయ భూమిని,వ్యవసాయేతర భూమిగా మార్చకుండా, రెవెన్యూ శాఖకు,పురపాలకకు ఇవ్వాల్సిన పది శాతం భూమి ఇవ్వకుండా అలాగే వెంచర్ అనుమతికి చలానాలు పురపాలికకు చెల్లించకుండా ఆయా వెంచర్ యజమానులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ ఇళ్ల స్థలాలను లక్షల రూపాయలకు క్రయ విక్రయాలు జోరుగా జరుపుతున్నారు. మున్సిపాలిటీకి కోట్ల రూపాయలు నష్టం జరగుతున్నా మున్సిపల్ అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరించటం సమంజసం కాదని చట్టపరమైన చర్యలు తీసుకోకపోతే సంబంధిత ఉన్నతాధికారులకు పిర్యాదు చేస్తామని సీపీఐ నాయకులు హెచ్చరించారు.

