దేశ ప్రజలకు 79వ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన ఎంపీ
1 min read

ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్ నేడు : మనం ఈరోజు అనుభవిస్తున్న స్వాతంత్య్రం ఎందరో మహానుభావుల త్యాగ ఫలితం. ఈ స్వాతంత్య్రం కోసం ఆనాడు కోట్లాది మంది ప్రజలు కుల, మత వర్గలు తేడా లేకుండా భారతీయులుగా మాత్రమే నిలిచిపోరాడారు. వారి స్పూర్తితో మనం కూడా దేశం కోసం, రాష్ట్రం కోసం కలిసికట్టుగా పనిచేద్దాం. నూతన లక్ష్యాలను నిర్దేశించుకుంటూ అభివృద్ధి పధంలో దేశాన్ని ముందుకు తీసుకువెళుతున్న ప్రభుత్వాలు ఇప్పుడు మనకు ఉన్నాయని ఈ పునర్నిర్మాణ కార్యక్రమంలో అందరం భాగస్వాములయ్యి పనిచేద్దామని, ఈ స్వాతంత్య్ర దినోత్సవం మీ అందరి జీవితాల్లో మరిన్ని వెలుగులు నింపాలని ఏలూరు ఎంపీ కోరుకున్నారు. ఇదే సందర్భంలో మహిళా సంక్షేమమే ధ్యేయంగా పనిచేసే మన కూటమి ప్రభుత్వం మహిళలకు అందిస్తున్న మరో వరం “స్త్రీ శక్తి ” ఉచిత బస్సు పథకం కూడా రేపు మొదలు అవుతుండటం అందరం ఆనందించదగ్గ శుభ సమయం. ఈ అవకాశాన్ని రాష్ట్రంలోని మహిళలంతా ఉపయోగించుకొని, స్వేచ్ఛగా, సురక్షితంగా ప్రయాణాలు చేయవలసిందిగా ఏలూరు జిల్లా సోదరీమణులందరికీ ప్రత్యేక అభినందనలు తెలిపారు.

