సిపిఓ కార్యాలయంలో హార్ ఘర్ తిరంగా కార్యక్రమం
1 min read

ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్ నేడు : జిల్లా కలెక్టరేటులోని సిపివో కార్యాలయంలో గురువారం హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని సిపివో వాసుదేవరావు సిహెచ్. వాసుదేవరావు నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ దేశభక్తి కలిగి జాతీయ సమైక్యతకు సమగ్రతకు కృషి చేయాలని అన్నారు.మన జాతీయ జెండా ఎంతో విశిష్టత కలిగి ఉందన్నారు. పౌరులు అందరూ తమ ఇంటి వద్ద జాతీయ జెండాను పెట్టడం ద్వారా జాతీయ భావం ఉట్టిపడుతుందన్నారు.దేశ సమగ్రత, జాతీయ సమైక్యతకు త్రివర్ణ పతాకం స్ఫూర్తిగా నిలుస్తుందని అన్నారు. ఈ సందర్భంగా కార్యాలయ సిబ్బందితో కలిసి జాతీయ జెండా వద్ద సిపివో,తదితరులు సెల్ఫీ దిగారు.ఈ కార్యక్రమంలో అసిస్టెంటు డైరెక్టరు శ్రీదేవి,డిప్యూటీ ఎస్ వో లు జె.రాజశేఖర్ ,సిహెచ్. కేశవరావు, గంగాధర్, ప్రభాకర్ రావు,డిస్టిక్ విజన్ యాక్షన్ ప్లాన్ సిబ్బంది, కార్యాలయ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

