మహానంది సన్నిధిలో తెలంగాణ సీఎం సోదరుడు
1 min read

మహానంది, న్యూస్ నేడు: మహానంది సన్నిధిలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు జగదీశ్వర్ రెడ్డి శుక్రవారం పూజలు నిర్వహించారు. ఆయనకు ఆలయ ఇన్స్పెక్టర్ మల్లయ్య స్వాగతం పలికారు. అనంతరం స్వామి వారికి అభిషేకం అమ్మవారికి కుంకుమార్చన తదితర పూజా కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం దృశ్యాలువతో సత్కరించి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట ఆలయ ఉప ప్రధాన అర్చకులుకొమ్మొద్ది శంకరయ్య, అర్చకులు రాము , కొమ్మొద్ది సుబ్బయ్య, కానిస్టేబుళ్లు చంద్రశేఖర్, శేషన్న తదితరులు పాల్గొన్నారు.

