NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

శ్రీ షిరిడి సాయి ప్రేమ మందిర్ కమిటీ హాల్ కు శంకుస్థాపన

1 min read

శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే సతీమణి మీనా,కో-ఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు

ఆ దైవ సేవా కార్యక్రమాలకు ఉపయోగపడాలన్నదే నా ఆకాంక్ష:ఇసుకపల్లి తాతారావు

ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్​ నేడు  : స్థానిక ప్రజలు,భక్తులు అవసరాలను గుర్తించి కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేపడుతున్నామని నగరపాలక సంస్థ కో-ఆప్షన్ సభ్యులు ఎస్ఎమ్ఆర్ పెదబాబు అన్నారు.స్థానిక ఆదివారపేట మార్కెట్ సమీపంలో శ్రీ షిరిడి సాయి ప్రేమ మందిర్ వద్ద ఉన్న కార్పొరేషన్ సంబంధించిన స్థలంలో కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి ఆదివారం శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఏలూరు శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య  సతీమణి మీనా,కార్పొరేటర్ ఇలియాజ్ పాషా,శ్రీ షిరిడి సాయి ప్రేమ మందిర్ పున:నిర్మాణ  వ్యవస్థాపక చైర్మన్ ఇసుకపల్లి తాతారావు( ఐ టి ఆర్) ఇతర కమిటీ సభ్యులు తదితరులు  పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎస్ఎంఆర్ పెదబాబు మాట్లాడుతూ శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య,నగరపాలక సంస్థ మేయర్ షేక్ నూర్జహాన్ పెదబాబు శ్రీ షిరిడి సాయి ప్రేమ మందిర్ వారి అభ్యర్థన మేరకు.అక్కడ అవసరాలను గుర్తించి కమ్యూనిటీ హాలు నిర్మాణానికి అనుమతి ఇచ్చారన్నారు.శ్రీ షిరిడి సాయి బాబా వారి కార్యక్రమాలు జరిగేటప్పుడు అన్నదానం మరియు ఎన్నో దైవ కార్యక్రమాలకు ఇతర కార్యక్రమాలకు ఉపయోగపడే విధంగా కమ్యూనిటీ హాల్ నిర్మించడం చేపట్టడం జరుగుతుందన్నారు. కాంట్రాక్టర్ ఇసుక పల్లి తాతారావు ఆధ్వర్యంలో గత 6 సంవత్సరాల క్రితం ఇక్కడ శ్రీ షిరిడి సాయిబాబా వారి సాయి ప్రేమ మందిర్ పేరుతో ఆలయాన్ని నిర్మించి.అనేక నిత్యం భజనలు భక్తి,సేవ కార్యక్రమాలు చేస్తున్నారన్నారు. అయ్యప్ప మాల ధారణ వేసుకున్న వారికి మరియు ప్రతి గురువారం పేదలకు అన్నదానం చేయడం వంటి గొప్ప సేవా కార్యక్రమాలు చేస్తున్న కమిటీ సభ్యులు మరింత మంచి సేవా కార్యక్రమాలు చేయాలని ఎస్ఎంఆర్ పెదబాబు ఆకాంక్షించారు. ఆ దైవ సేవ కార్యక్రమాలకు ఉపయోగపడాలన్నదే నా ఆకాంక్ష అని ఇసుకపల్లి తాతారావు అన్నారు. కార్యక్రమంలో శ్రీ షిరిడి సాయి ప్రేమ మందిర్ కమిటీ సభ్యులు, మహిళా భక్త బృందం, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

About Author