PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

రోడ్డు వెడల్పు, డ్రైనేజీ కాలువలు  పబ్లిక్ యూరిన్ టాయిలెట్స్ ఏర్పాటు చేయాలి

1 min read

పల్లెవెలుగు వెబ్ పత్తికొండ : పత్తికొండ పట్టణంలో రోడ్ కటింగ్ చేసి డ్రైనేజ్ పబ్లిక్ యూరిన్ టాయిలెట్స్ ఏర్పాటు చేయాలని బుధవారం పత్తికొండ రెవెన్యూ డివిజన్ అధికారి( ఆర్ డి ఓ)కి సిపిఐ బృందం వినతి పత్రం అందజేశారు. సిపిఐ జిల్లా కార్యదర్శి బి గిడ్డయ్య, సిపిఐ మండల కార్యదర్శి డి రాజా సాహెబ్, సిపిఐ జిల్లా సమితి సభ్యులు గురుదాస్, కారన్న, పెద్ద ఈరన్న కలిసి ఆర్డిఓ కు వినతి పత్రం అందజేశారు. అనంతరం సిపిఐ జిల్లా కార్యదర్శి బి గిడ్డయ్య సిపిఐ మండల కార్యదర్శి డి రాజా సాహెబ్ మాట్లాడుతూ,పత్తికొండ పట్టణంలో గత బ్రిటిష్ కాలంలోనే జనాభాకు తగ్గట్టుగా రోడ్లు డ్రైనేజీ కాలువలు ఏర్పాటు చేసి సౌకర్యం కల్పించి మెరుగైన జీవనాన్ని కొనసాగించారు. అయితే స్వతంత్రం వచ్చి 75   సంవత్సరాలు పూర్తి అయినా పత్తికొండలో  పట్టణంలో జనాభా  రోజు రోజుకి పెరుగుతూ,   వస్తూ ఉన్నది.కానీ రోడ్లు మాత్రం బ్రిటిష్ వారి కాలంలో ఎంత ఎడల్పు ఉన్నదో అదే రోడ్ ఇప్పుడు ఉందన్నారు. పట్టణం పెరుగుతూ ప్రజల పెరుగుతూ మారుతున్న కాలానికి అనుగుణంగా రోడ్లు వెడల్పు డ్రైనేజీ రోడ్డుకు ఇరువైపులా ఫుట్బాత్ ను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఇతర ప్రాంతాల్లో వసతులు కల్పించారు కానీ పత్తికొండలో మాత్రం ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉన్నట్టుందన్నారు. పత్తికొండలో పట్టణంలో  ఉన్న స్కూల్ పిల్లలు మరియు చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న   స్కూలుకు  పోయే పిల్లలు స్కూల్ పోవాలంటే బజార్లో వాహనాలు నిత్యం రద్దీగా ఉంటూ ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి ఏర్పడిందని, మహిళలు వయసు మీద పడిన ముసలోళ్ళు ఏదో ఒక పని మీద రోడ్డు మీదకి రావాలంటే ప్రాణాల అరిచేతులు పెట్టుకొని నడవాల్సిన పరిస్థితి దాపురించింది.

About Author