కరాటే క్రీడాకారులను అభినందించిన మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్
1 min read

కర్నూలు, న్యూస్ నేడు: జాతీయ స్థాయిలో గోల్డ్ మెడల్ సాధించిన దినేష్ అనే క్రీడాకారుని మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ ఈరోజు అభినందించారు. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జాతీయ స్థాయిలో ఢిల్లీలో నిర్వహించిన కరాటే క్రీడకు ఎంపిక కావడమే కాకుండా, అక్కడ దినేష్ గోల్డ్ మెడల్ సాధించారు. ఈ సందర్భంగా టీజీ వెంకటేష్ మాట్లాడుతూ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ లో జాతీయస్థాయిలో దినేష్ గోల్డ్ మెడల్ సాధించడం కర్నూలు జిల్లాకే గర్వకారణం అన్నారు. నిరంతర కృషి పట్టుదల ఉంటే క్రీడలలో రాణించవచ్చనే దానికి దినేష్ ఉదాహరణ అని ఆయన అన్నారు. క్రీడలతో శారీరక దృఢత్వంతో పాటు, మానసిక ఉల్లాసం కూడా ఉంటుందని ఇందువల్ల చదువు, క్రమశిక్షణ అలబడుతుందని టీజీ వెంకటేష్ అన్నారు. స్వాతంత్రదినోత్సవ సందర్భంగా ఆగస్టు 15న రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ నిర్వహించిన అట్ హోమ్ కార్యక్రమానికి దినేష్ ను ఆహ్వానించడం క్రీడాకారులకు లభించే గౌరవమని అన్నారు. ఈ కార్యక్రమంలో కరాటే శిక్షకుడు జగదీష్, రాంబాబు, డేవిడ్, ఆరిఫ్, హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.

