NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

రోడ్డు ప్రమాదాల నియంత్రణే లక్ష్యంగా  స్పెషల్ డ్రైవ్ 

1 min read

జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపియస్

కర్నూలు , న్యూస్​ నేడు:  రోడ్డు ప్రమాదాల నియంత్రణ చర్యల్లో భాగంగా ఆగష్టు నెల అంతా రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని డిజిపి హరీష్ కుమార్ గుప్తా  ఆదేశాల మేరకు కర్నూలు జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపియస్ జిల్లా పోలీసు అధికారులను ఆదేశించారు. ఈనెలలో  స్పెషల్ డ్రైవ్ లు :ఆగష్టు 4 వ తేది నుండి  ఆగస్టు 10 వరకు…మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై డ్రంకెన్ డ్రైవ్ పై స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు.  491 డ్రంకెన్ డ్రైవ్ కేసులు నమోదు చేశారు.  ఆగస్టు 11–17 వరకు ..వేగాన్ని మించి అతి వేగంగా వెళ్లే వాహనాల పై హై స్పీడ్ డ్రైవ్ నిర్వహించారు.399 ఓవర్ స్పీడ్ కేసులు నమోదు చేశారు.  ఆగస్టు 18–24 వరకు …హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనాల పై ప్రయాణించే వారి పై స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. ఆగస్టు 25–31: ప్రమాదాలకి ఎక్కువగా గురయ్యే ప్రాంతాలను గుర్తించేందుకు బ్లాక్ స్పాట్ గుర్తింపు డ్రైవ్ నిర్వహించనున్నారు.జిల్లా వ్యాప్తంగా ఆయా సి.ఐ లు/ ఎస్సై ల ఆధ్వర్యంలో పోలీసులు రహదారుల పై వాహనాల తనిఖీలు , డ్రంకెన్ డ్రైవ్, ఓవర్ స్పీడ్, హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనాలు నడిపే వారి పై గట్టి చర్యలు చేపట్టారు.

About Author