పారిశుద్ధ్య సమస్యలను సమన్వయంతో పరిష్కరించండి
1 min read
నగరపాలక సంస్థ కమిషనర్ పి.విశ్వనాథ్
కర్నూలు, న్యూస్ నేడు: మంగళవారం నగరంలో పారిశుద్ధ్య పనులను సంబంధింత అధికారులు సమన్వయంతో పరిష్కరించాలని నగరపాలక కమిషనర్ పి.విశ్వనాథ్ ఆదేశించారు. మంగళవారం ఆయన 37వ వార్డు శాంతినగర్ ప్రాంతాన్ని పరిశీలించారు. రహదారులపై వర్షపు నీరు నిలవకుండా ఆక్రమణలు తొలగించి కచ్చ కాలువ నిర్మించాలని ఆదేశించారు. శాశ్వత పరిష్కారానికి రూ.50 లక్షలతో సిసి డ్రైన్ నిర్మాణానికి సత్వరమే చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అదేవిధంగా నందికొట్కూరు రహదారిన విస్తరణకు సంబంధించి మార్కింగ్, బాధితులకు ఎండార్స్మెంట్ ప్రక్రియలను కమిషనర్ పరిశీలించారు. త్వరితగతిన ప్రక్రియ పూర్తి చేయాలని కమిషనర్ అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో సిటి ప్లానర్ ప్రదీప్ కుమార్, ఎంఈ మనోహర్ రెడ్డి, డిఈఈ క్రిష్ణలత, పట్టణ ప్రణాళిక అధికారి అంజాద్ బాష, తదితరులు పాల్గొన్నారు.

