NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

దళితుల భూములను కబ్జా చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలి..

1 min read

రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి రామకృష్ణ డిమాండ్..

ఓర్వకల్లు , న్యూస్​ నేడు : దళిత భూములను కబ్జా చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జి. రామకృష్ణ డిమాండ్ చేశారు.కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండల పరిధిలోని నన్నూరు గ్రామంలో 70 సం.ల నుండి దళితులు సాగులో ఉంటూ పంటలు వేసుకుంటూ ఉన్నారని పొలాలను సర్వే చేసి వారి పేర్లు మీద ఆన్ లైన్ చేయాలన్నారు.బుధవారం దళితుల పొలాలను రైతు సంఘం నాయకులు పరిశీలించారు.రామకృష్ణ మరియు వ్యకాస జిల్లా ప్రధాన కార్యదర్శి నాగన్న మాట్లాడుతూ సర్వే నెంబర్   1292 లో 2008 లో ప్రభుత్వం దళిత పేదలకు పట్టా పాస్ పుస్తకాలు మంజూరు చేసిందని అలాంటి భూముల్లో వేసిన కంది పంటను ట్రాక్టర్లతో జెసీబీ లతో నాశనం చేయడం దుర్మార్గమైన చర్య అని ఆవేదన వ్యక్తం చేశారు.సాగు చేస్తున్న పొలాలను ఇతరుల సహాయంతో దళితులను భయభ్రాంతులకు గురి చేశారని ఇప్పటికైనా పోలీస్ అధికారులు స్పందించి పొలాలను నాశనం చేసిన వారిపై తగిన చర్యలు చేసుకోవాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో కృష్ణ,మధుసూదన్,బషీర్ లింగేశ్వరుడు,సంజీవుడు శివకుమార్ బాధిత రైతులు పాల్గొన్నారు.

About Author