ఆర్టీసీ డిపో గౌరవ అధ్యక్షులుగా పి తిక్క రెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నిక..
1 min read

ఎమ్మిగనూరు, న్యూస్ నేడు: ఎమ్మిగనూరు పట్టణంలో మర్యాదపూర్వకంగా పి .తిక్కరెడ్డిని కలిసాం.. నేషనల్ మజ్దూర్ యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు. పి తిక్క రెడ్డి తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు ని మరొక్కసారి నేషనల్ మజ్దూర్ యూనియన్ ఎమ్మిగనూరు డిపో గౌరవాధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఆయనను ఆయన స్వగృహంలో నేషనల్ మజ్దూర్ యూనియన్ ఎమ్మిగనూరు డిపో అధ్యక్ష ,కార్యదర్శులు రఫిక్, ముస్తాక్ అహ్మద్ లు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు ఎమ్మిగనూరు డిపోలోని సమస్యలను వివరించారు. అదే కాక సూపర్ సిక్స్ లో భాగంగా ఏపీఎస్ఆర్టీసీలో మహిళలకు ఫ్రీ బస్సు పథకం ద్వారా మహిళలు ఎమ్మిగనూరు డిపోలో ఉన్న బస్సులను కూడా సద్వినియోగం చేసుకుంటున్నారని కూటమి ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రతి మహిళ సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నారని తెలిపారు.

