జిల్లాలో సరిపడా ఎరువులు ఉన్నాయి,రైతులకు ఎటువంటి కొరత లేదు
1 min read

జిల్లాకలెక్టర్ కె. వెట్రీసెల్వి
మోతాదుకు మించి ఎరువులు వినియోగం జరగకుండా వ్యవసాయశాఖ సిబ్బంది పర్యవేక్షించాలి
ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్ నేడు : జిల్లాలో సరిపడా ఎరువుల నిల్వలు ఉన్నాయని, ఎటువంటి కొరత లేదని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడికి తెలియజేసారు. రాష్ట్రంలో ఎరువుల సరఫరా పై అన్ని జిల్లాల కలెక్టర్లతో మంగళవారం సెక్రటేరియట్ నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మంత్రి అచ్చెన్నాయుడు సమీక్షించారు. ఈ సందర్బంగా మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ రాష్ట్రంలో ఎరువులకు ఎటువంటి కొరతా లేదన్నారు. సాగుకు సరిపడా ఎరువులను అన్ని జిల్లాల్లోనూ రైతులకు అందుబాటులో ఉంచామన్నారు. రైతులందరికీ ఎరువులు సరఫరా అయ్యేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్రంలో ఎరువుల కృత్రిమ సృష్టించే వారిపై కేసులు నమోదు చేయాలన్నారు. జిల్లాలో ఎరువుల దుకాణాలపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించి, అక్రమంగా నిల్వ ఉంచేవారిపై కేసులు నమోదు చేస్తున్నామని, అంతేకాక ఎవరైనా డీలర్లు ఎరువులను బ్లాక్ మార్కెటింగ్ చేసినా, అధిక ధరలకు అమ్మినా వారిపై కేసులు నమోదు చేస్తున్నామని మంత్రికి తెలియజేసారు.

