NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

శౌర్య హోండా ఆధ్వర్యంలో సీబీ 125  నూతన బైక్ మార్కెట్లోకి విడుదల

1 min read

కర్నూలు , న్యూస్​ నేడు: నగరంలోని జీ.పుల్లారెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో శౌర్య హోండా షోరూం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సిబి 125 మోటార్ బైక్ ను రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ ముఖ్యఅతిథిగా హాజరై మార్కెట్లోకి విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో శౌర్య హోండా షోరూం అధినేత విశ్వమోహన్, డాక్టర్ కేవీ సుబ్బారెడ్డి విద్యాసంస్థల అధినేత డాక్టర్ కె వి సుబ్బారెడ్డి , కార్పొరేటర్ పద్మలతారెడ్డి తోపాటు శౌర్య హోండా సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ మాట్లాడుతూ శౌర్య హోండా ఆధ్వర్యంలో సీబీ 125 అనే నూతన బైక్ను మార్కెట్లోకి విడుదల చేసిన కార్యక్రమాన్ని ఇంత ఘనంగా నిర్వహించడం అభినందనీయమన్నారు. హోండా కంపెనీకి సంబంధించి ఏ నూతన బైకు మార్కెట్లోకి వచ్చిన కర్నూల్ నగరంలో వెంటనే వాటిని మార్కెట్లోకి విడుదల చేస్తున్న శౌర్య హోండా షోరూం అధినేత విశ్వమోహన్ ను ఆయన అభినందించారు. నూతనంగా మార్కెట్లోకి వచ్చిన సీబీ 125 బైక్ లీటర్ కు 80 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుందని షోరూం ప్రతినిధులు తెలిపారని, ఇది ఎంతో ఉపయోగకరమైన చెప్పారు .దీనికి తోడు ఇంధనం ఆదాతో పాటు కాలుష్య రహితంగా ఈ మోటర్ బైక్ను తీర్చిదిద్దడం అభినందనీయమని చెప్పారు. ఈ బైకు వేగంగా ఉన్న నేపథ్యంలో బైక్ రైడింగ్ చేసేవారు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి బైకులు నడపాలని ఆయన సూచించారు. శౌర్య హోండా షోరూం వ్యాపార పరంగా మరింత విజయవంతంగా ముందుకు సాగాలని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ ఆకాంక్షించారు.

About Author