NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

గుర్తుతెలియని వ్యక్తులు వేరుశనగ పొట్టు కు నిప్పు

1 min read

మహానంది,న్యూస్​ నేడు:  గుర్తుతెలియని వ్యక్తులు వేరుశెనగ పొట్టు కు నిప్పు పెట్టినట్లు బొల్లవరం గ్రామానికి చెందిన తురగా వెంకటరాముడు శనివారం ఉదయం పేర్కొన్నారు. శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఈ సంఘటన జరిగినట్లు తెలిపారు. 40 పొట్టేళ్లు కొన్నానని వాటి గ్రాసం కోసం ఇతర ప్రాంతాల నుండి వేరుశెనగ పొట్టును 3 ట్రాక్టర్లు ద్వారా తరలించి తన ఇంటి ముందు ఏర్పాటు చేసుకున్న ప్రత్యేక రేకుల షెడ్డులో నిల్వ చేసుకున్నట్లు తెలిపారు. శుక్రవారం అర్ధరాత్రి సమయంలో రేకుల షెడ్డు నుండి పొగ, మంటలు రావటాన్ని గమనించి అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించానన్నారు. వారు వచ్చి మంటలను ఆర్పి వేసినట్లు తెలిపారు. దాదాపు లక్ష రూపాయలు విలువచేసే గ్రాసం కాలిపోయినట్లు బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఉన్న 40 పొట్టేళ్లకు గ్రాసం లేదని వాటిని అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు.

About Author