సురవరం మృతి సిపిఐ కి తీరని లోటు
1 min read

పత్తికొండ, న్యూస్ నేడు: కమ్యూనిస్టు యోధులు సురవరం సుధాకర్ రెడ్డి మృతి కమ్యూనిస్టు పార్టీలకు తీరని లోటు అని దళిత పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆర్ గురుదాసు సిపిఐ మండల సహాయ కార్యదర్శి పెద్ద వీరన్న, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు వెంకటరామిరెడ్డి అన్నారు. శనివారం స్థానిక చదువుల రామయ్య భవన్లో సురవరం సుధాకర్ రెడ్డి మృతికి సంతాప సభను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ, సురవరం సుధాకర్ రెడ్డి నిర్భయమైన మేధావి నుండి భారతదేశంలోని లక్షలాదిమంది శ్రమజీవుల గొంతుకగా నిలిచారని అన్నారు. సురవరం సుధాకర్ రెడ్డి తరగతి గది నుండి ప్రపంచ సహచరత్వం వరకు ప్రయాణానికి ఉదాహరణగా మిగిలారని తెలిపారు. ప్రజల దయనందిన పోరాటాలలో పాతుకుపోయిన పుత్రపారాయ నాయకత్వానికి ఆయన జీవితం ఒక బ్లూ ప్రింట్ ను అందిస్తుందని వారు ఉదాహరించారు. శ్రమైక జీవుల కోసం జీవితకాలం పాటుబడిన సురవరం సుధాకర్ రెడ్డి అడుగుజాడల్లో నడుద్దామని వారు పిలుపునిచ్చారు. ఆయన ఆశయ సిద్ధికి మనందరం కలిసికట్టుగా పని చేద్దామని కోరారు. ఈ కార్యక్రమంలో సి తాలూకా అధ్యక్ష కార్యదర్శులు నెట్టికంటయ్య, ఎం రంగన్న, ఏం రాజప్ప, హమాలీ సంఘం నాయకులు నాగేంద్ర, రంగస్వామి, శివ, పెద్దహుల్తి పరశురాముడు, ఉచ్చప్ప తదితరులు పాల్గొన్నారు.

