ప్రజల కోసం పనిచేసిన నిస్వార్థపరుడు సురవరం
1 min read

సిపిఐ రాష్ట్ర కార్యవర్గ కార్యదర్శి సభ్యుడు డేగ ప్రభాకర్
ఏలూరు ఏరియా సమితి కార్యదర్శి ఉప్పులూరి హేమ శంకర్
ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్ నేడు : ప్రజా సమస్యల పరిష్కారం కోసం జీవితకాలం పోరాడిన త్యాగధనుడు సురవరం సుధాకర్ రెడ్డిఅని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డేగా ప్రభాకర్ అన్నారు. భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఏలూరు ఏరియా సమితి ఆధ్వర్యంలో ఆర్ఆర్ పేట స్ఫూర్తి భవన్ నందు ఏలూరు ఏరియా సమితి కార్యదర్శి ఉప్పులూరు హేమ శంకర్ అధ్యక్షతన సిపిఐ మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి పార్లమెంటు సభ్యులు సురవరం సుధాకర్ రెడ్డి సంతాప కార్యక్రమం జరిగినది.ఈ కార్యక్రమంలో పాల్గొన్న సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డేగా ప్రభాకర్ మాట్లాడుతూ అందరికీ కమ్యూనిస్టు పార్టీ ఉద్యమంలో పనిచేయడానికి స్ఫూర్తిని ఉత్సాహాన్ని కలిగించిన మహోన్నత వ్యక్తి సురవరం సుధాకర్ రెడ్డి అని కొనియాడారు.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వెనుకబడిన మహబూబ్ నగర్ జిల్లాలో జన్మించి, కర్నూలులో విద్యాభ్యాసం చేస్తూ,ప్రజలు పడుతున్న కష్టాలు ఇబ్బందులు తొలగించడం పోరాటాల ద్వారానే సాధ్యపడుతుందని నమ్మి విద్యార్థి దశ నుంచే ఉద్యమాలు నిర్వహించిన గొప్ప వ్యక్తి సురవరం సుధాకర్ రెడ్డి అని కొనియాడారు.ఈ కార్యక్రమంలో సిపిఐ ఏలూరు ఏరియా సమితి సహాయ కార్యదర్శి కార్యదర్శులు కురెళ్ళ వరప్రసాద్,అడ్డగర్ల లక్ష్మీ ఇందిరా, కార్యవర్గ సభ్యులు మావూరి విజయ, శాయన అభిలాష్ కుమార్, గొర్లి స్వాతి కొండేటి బేబీ, ఉప్పులూరి లక్ష్మి, భజంత్రీ శ్రీనివాసరావు, ఆటోనగర్ అధ్యక్షులు అరుణ తార నాగేశ్వరరావు, బళ్ల కనక దుర్గారావు,తంగెళ్ల మూడి శాఖ కార్యదర్శి ఎం.ఏ హకీమ్, కొండేటి రాంబాబు, ఉప్పులూరి రవి,బేతా శంకర్, భవాని, పూజ్య లక్ష్మీ అరుణ, బి కృష్ణ ప్రసాద్,శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.

