పండుగలను ప్రశాంత వాతావరణంలో జరుపుకుందాం…
1 min read

గణేష్ మండపాలకు అనుమతి తప్పనిసరి…..డీఎస్పీ వెంకట్రామయ్య….
హోళగుందలో పీస్ కమిటీ సమావేశం….
హొళగుంద న్యూస్ నేడు : పండుగలను ప్రశాంత వాతావరణంలో సోదర భావంతో కలిసి మెలిసి జరుపుకుందామని పత్తికొండ డిఎస్పి వెంకటరామయ్య, ఆలూరు సిఐ రవిశంకర్ రెడ్డి, హోళగుంద ఎస్ ఐ దిలీప్ కుమార్ అన్నారు.వినాయక చవితి గణేష్ ఉత్సవాల సందర్భంగా హోళగుంద ఎస్సై దిలీప్ కుమార్ పోలీస్ స్టేషన్ ఆవరణo నందు గ్రామస్తులతో పీస్ కమిటీ సమన్వయ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి పత్తికొండ డివిజన్ డిఎస్పి వెంకటరామయ్య, ఆలూరు సిఐ రవి శంకర్ రెడ్డి, హోళగుంద తహసీల్దార్ నిజాముద్దీన్ హాజరయ్యారు.ఈ సమావేశాన్ని ఉద్దేశించి వారు మాట్లాడుతూ వినాయక చవితి పండుగను ఆహ్లాదకరమైన వాతావరణంలో సోదర భావంతో కలిసిమెలిసి ఆనందంగా జరుపుకుందామని అన్నారు. వినాయక మండపాలను ఏర్పాటు చేయదలచిన వారు అనుమతి కొరకు ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన గణేష్ ఉత్సవ్.నెట్ అనే వెబ్సైట్ నందు తమ వివరాలు నమోదు చేసి అనుమతి పొందాలని అన్నారు. సోషల్ మీడియా లో వ్యాప్తి చెందే వదంతులను నమ్మవద్దని, సోషల్ మీడియాలో ఇతరులు పోస్ట్ చేసిన సందేశాలను ఉద్దేశించి వ్యతిరేక ధోరణిలో మెసేజ్ లు పెట్టడం చేయకూడదని సూచించారు. ఎవరైనా ఇబ్బందికరంగా పోస్టులు పెడితే పోలీసులకు సమాచారం అందించాలని అలాంటి వారిపై పెట్టిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మండపాల దగ్గర ప్రమాదకరంగా మారే విద్యుత్ తీగలకు, లైట్లకు పిల్లలను దూరంగా ఉంచాలని, మండపాల దగ్గర తగిన జాగ్రత్తలు వహించాలని సూచించారు. సోదరభావంతో ఇతర మతస్తులను, వారి ఆచారాలను గౌరవిస్తూ, ఇతరుల మనోభావాలకు భంగం కలగకుండా వ్యవహరిస్తూ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అందరూ కలిసిమెలిసి ప్రశాంత వాతావరణంలో పండగలు చేసుకుందామని ప్రజలకు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో డిఎస్పి వెంకటరామయ్య, ఆలూరు సీఐ రవి శంకర్ రెడ్డి, హోళగుంద ఎస్ఐ దిలీప్ కుమార్,తహశీల్దార్ నిజాముద్దీన్,పోలీస్ సిబ్బంది, గ్రామ పెద్దలు, గ్రామస్తులు, ప్రజా ప్రతినిధులు, యువకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.


