NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ప్రతిభ పురస్కారాలు అందజేసిన ఎంపీ

1 min read

విద్యతోనే ఉజ్వల భవిష్యత్తు, రజక చైర్ పర్సన్ సావిత్రి

రజక కమ్యూనిటీ హాల్ కు,1500000, లక్షలు కేటాయించిన ఎంపీ, బస్తీ, పాటి నాగరాజు

హొళగుంద న్యూస్ నేడు  :  విద్యతోనే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని విద్యార్థులు అన్ని రంగాలలో రాణించాలని ఎంపీ బస్తీ,పాటి నాగరాజు పిలుపునిచ్చారు కర్నూలు నగరంలో రాజ్ విహార్ లోని అంబేద్కర్ భవన్లో రజక విద్యా సమితి ఆధ్వర్యంలో ఏడవ రజక విద్యార్థుల ప్రతిభ పురస్కారాల కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంపీ బస్తిపాటి నాగరాజ్ తో పాటు మాజీ ఎమ్మెల్సీ, మాజీ ఎమ్మెల్యే దువ్వారపు, రామారావు, రజక కార్పొరేషన్ చైర్ పర్సన్ సావిత్రి హాజరయ్యారు పది, ఇంటర్ డిగ్రీలలో ఉత్తమ మార్కులు సాధించిన 92 మంది,విద్యార్థులకు మెడల్స్ తో పాటు 2000 వేలు నగదు, పుష్కరాన్ని అందజేశారు, అనంతరం, ఎంపీ,బస్తిపాటి నాగరాజు మాట్లాడుతూ చదువు ద్వారానే సంఘంలో మర్యాద హోదా దక్కుతుందని ప్రతి విద్యార్థి బాగా చదివి ఉన్నత శిఖరాలను చేరుకోవాలని అన్నారు ఇందులో భాగంగా, హొళగుంద మండలానికి చెందిన బాపూజీ ఇంగ్లీష్ మీడియం ప్రధానోపాధ్యాయుడు, రజక లక్ష్మణ, కుమారుడు కూడా, ఈ పుష్కారాన్ని అందుకున్నారు, అందుకున్న సందర్భంగా, మండల రజక సంఘం నాయకులు కృతజ్ఞతలు తెలిపారు, అలాగే, ఆదోనిలో రజక కమ్యూనిటీ హాల్ కొరకు, రజక చైర్ పర్సన్ సావిత్రి ఎంపీ బస్తిపాటి నాగరాజును కోరగా ఎంపీ నాగరాజు, ఎంపీ నిధుల కింద 15, లక్షలు, నిధులను త్వరలోనే కేటాయిస్తామని,తెలిపారు, బస్తిపాటి నాగరాజుకు, ఆదోని రజక సంఘం నాయకులు ధన్యవాదాలు తెలిపారు, ఈ కార్యక్రమంలో, ఎంపీ బస్తీ,పాటి నాగరాజు, మాజీ ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు రాష్ట్ర రజక చైర్ పర్సన్ సావిత్రి, రజక సంఘం నాయకులు విద్యార్థులు పాల్గొన్నారు.

About Author