NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

నేత్ర దాన అవగాహన సదస్సులు నిర్వహించి ప్రజల్లో చైతన్యం కలిగించాలి

1 min read

జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి

ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్​ నేడు  : జిల్లా కలెక్టరేటు గోదావరి సమావేశ మందిరంలో సోమవారం జిల్లా అంధత్వ నివారణ సంస్థ 40వ జాతీయ నేత్ర దాన పక్షోత్సవాలు గోడపత్రికలను జిల్లా అంథత్వ నివారణ సంస్థ అధ్యక్షులు, జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా అన్ని  ప్రాధమిక ఆరోగ్య, మండల కేంద్రాలలో నేత్ర దాన అవగాహన సదస్సులు, ర్యాలీలు జరుపుటకు అన్ని చర్యలు చేపట్టాలన్నారు. కరపత్రాలు, ఫ్లెక్సీ  బ్యానరులు, ఎలక్ట్రానిక్ , ప్రింటు, సోషల్ మీడియా ద్వారా జిల్లా వ్యాప్తంగా విస్తృతంగా ప్రచారం చేయుటకు కార్యాచరణ రూపొందించి అందుకు అనుగుణంగా కార్యక్రమాలు నిర్వహించాలని అన్నారు. కార్నియాలు అవసరం రోజు రోజుకి అవసరం పెరుగుతూ ఉందని, కార్నియాలు అవసరానికి మరియు సేకరణకు మధ్య చాలా వ్యత్యాసం ఉందన్నారు.ఈ అంతరం పూరించడానికి దేశవ్యాప్తంగా ప్రతి సంవత్సరం ఆగష్టు 25 నుండి సెప్టెంబరు 08వ తేదీ వరకు జాతీయ నేత్ర దాన పక్షోత్సవాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. నేత్ర దానంపై  ప్రజలందరికీ అవగాహన కలిగించాలన్నారు. ప్రతి ఒక్కరూ స్వచ్చందగా నేత్ర దానానికి ముందుకు వచ్చి మరణానంతరం తమ నేత్రాల దానానికి సమ్మతించి  నేత్ర దాన విజ్ఞాపన పత్రాన్ని నింపితే ఈ కార్యక్రమానికి మంచి ఫలితాలు వచ్చినట్లేనని అన్నారు. కార్నియాల లభ్యత  అంధుల పాలిట వరమవుతుందని మన ఈ ప్రయత్నం అందరి సహకారంతో సఫలీకృతం కావాలని జిల్లా కలెక్టరు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అంధత్వ నివారణ సంస్థ ఉపాధ్యక్షులు మరియు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా.పి.జె .అమృతం, జిల్లాప్రోగ్రామ్ మేనేజరు డా.పి. మల్లిఖార్జున రాజు, జిల్లా అంధత్వ నివారణ సంస్థ సిబ్బంది, తదితరులు,పాల్గొన్నారు.

About Author