సూపర్ సిక్స్ సూపర్ హిట్ …
1 min read

శ్రీ శక్తి మహిళల ర్యాలీలో ఎమ్మెల్యే శ్యాం కుమార్
పత్తికొండ, న్యూస్ నేడు: ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను పూర్తిగా అమలుచేసి శ్రీ శక్తి మహిళల సత్తా ఏంటో నిరూపించుకున్నామని స్థానిక ఎమ్మెల్యే శ్యాం కుమార్ స్పష్టం చేశారు. సోమవారం పత్తికొండ పట్టణంలో సూపర్ సిక్స్ హామీలను కూటమి ప్రభుత్వం పూర్తిగా అమలు చేస్తున్న నేపథ్యంలో మహిళలు భారీగా ర్యాలీ నిర్వహించారు. సూపర్ సిక్స్ సూపర్ హిట్ కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గంలోని అన్ని మండలాల నుంచి భారీగా తరలివచ్చిన మహిళలు స్థానిక టిటిడి కళ్యాణ మండపం నుండి అంబేద్కర్ సర్కిల్ వరకు భారీగా ర్యాలీ నిర్వహించారు. దాదాపుగా ఎనిమిది వేల మంది మహిళలు ర్యాలీలో పాల్గొని శ్రీ శక్తి సత్త ను చాటారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కే ఈ శ్యామ్ కుమార్ మాట్లాడుతూ, సీఎం చంద్రబాబు మహిళ సంక్షేమం కోసం పాటుపడుతున్నారని అన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో మహిళలతోపాటు అన్నివర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారని తెలిపారు. మహిళల కోసం కూటమి ప్రభుత్వం ఏడాదికి మూడు సిలిండర్లు, బడికి వెళ్లే పిల్లలు ఎంతమంది పిల్లలు ఉంటే అంత మంది పిల్లలకు తల్లికి వందనం పథకం ద్వారా లబ్ధి చేకూర్చిన ఘనత బాబుకే దక్కిందన్నారు. రాష్ట్రంలో మహిళలు స్రీ శక్తి పథకం ద్వారా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ పథకం ప్రారంభమైందని తెలిపారు. త్వరలోనే 18 సంవత్సరాల నిండిన ప్రతి స్త్రీకి ఆడబిడ్డ నిధి నుండి నెలకు 1500 రూపాయలు అందజేసి సూపర్ సిక్స్ సూపర్ హిట్ అవుతుందని ధీమా వ్యక్తం చేశారు.. సైకో జగన్ పాలనలో రాష్ట్రంలోని అన్ని వ్యవస్థలు భ్రస్టు పట్టాయని కూటమి పాలన వచ్చిన తర్వాతనే ఆర్థిక పరిస్థితిని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సహకారంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తదితరులు పాల్గొన్నారు.


