NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

విద్యుత్ బారాలపై పోరాటాలకు సిద్ధం కండి 

1 min read

వామపక్షాల పిలుపు 

పత్తికొండ, న్యూస్​ నేడు: రాష్ట్ర ప్రభుత్వం మోడీ అనుకూల విద్యుత్ ఒప్పందాలను బాబు తూచా తప్పకుండా అమలు చేస్తున్నారని విద్యుత్ బారాలపై ప్రజలు పోరాటాలకు సిద్ధం కావాలని వామపక్షాల రాష్ట్ర నాయకులు రామచంద్రయ్య సిపిఎం మండల కార్యదర్శి చక్రాల వెంకటేశ్వర్ రెడ్డి పిలుపునిచ్చారు. విద్యుత్ ఛార్జింగ్ తగ్గించాలని, స్మార్ట్ మీటర్ల బిగింపు ను రద్దు చేయాలని కోరుతూ వామపక్ష పార్టీల పిలుపుమేరకు గురువారం పత్తికొండలో సిపిఐ, సిపిఎం, సిఐటియు, ఎఐటియుసిల ఆధ్వర్యంలో పత్తికొండ పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం నాలుగు స్తంభాల కూడలి వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. 2000 సంవత్సరంలో విద్యుత్ ఉద్యమంలో అమరులైన బాలస్వామి, విష్ణువర్ధన్ రెడ్డి, రామకృష్ణ అమరులకు నివాళులర్పించి వారి ఆశయ సాధన కోసం కృషి చేస్తామని ఓం పక్షాల నాయకులు, కార్యకర్తలు ప్రతిజ్ఞ చేశారు. సిపిఎం పార్టీ నాయకులు దస్తగిరి, సిపిఐ పార్టీ నాయకులు కారుమంచి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ, రాష్ట్రంలో విద్యుత్ బారాలతో వినియోగదారులు వ్యాపారస్తులు కార్మికులు తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారని అన్నారు.  పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని అలాగే స్మార్ట్ మీటర్లు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వామపక్ష నాయకులు. సిఐటియు మండల కార్యదర్శి ఎం రవిచంద్ర, ప్రజానాట్యమండలి నాయకులు పి.ఖాసిం రమేష్, సిపిఐ నాయకులు  రాజా సాబ్ గురుదాస్ కారుమంచి, నెట్టకంటయ్య,  డివైఎఫ్ఐ నాయకులు దుగ్గెన్న, హమాలి నాయకులు ఉరుకుందు, ఆటో నాయకులు మోహన్ శేఖర్, భవన నిర్మాణ సంఘం నాయకులు మంజు, నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు.

About Author