నేత్రదానం చేయండి ఇద్దరు అంధులకు చూపులు ప్రసాదించండి
1 min read

ప్యాపిలి, న్యూస్ నేడు: నేత్రదానం చేయండి ఇద్దరి అందులకు చూపులు ప్రసాదించండి అని కంటి వైద్య నిపుణులు వెంకట ప్రసాద్, రమణమూర్తి అన్నారు.ఈ సందర్భంగా శుక్రవారం డోన్ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో జాతీయ నేత్రదాన పక్షోత్సవాలు డోన్ ఆసుపత్రి సూపర్డెంట్ అనీఫ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జాతీయ నేత్రదాన పక్షోత్సవాలు ఆగస్టు 25 నుండి సెప్టెంబర్ 8వ తేదీ వరకు ఈ కార్యక్రమాలు నిర్వహినట్లు వారు తెలిపారు. వాటిపై అవగాహన కార్యక్రమం డోన్ ప్రభుత్వాసుపత్రుల్లో నిర్వహిస్తుదురదృష్టవశాత్తు, మీకు చాలా దగ్గర వ్యక్తి, లేదా పరిచయస్థులు ఎవరైన మరణిస్తే, వెంటనే అతి దగ్గరలోని కంటి బ్యాంక్ కి ఫోన్ చేయండి. మీ దగ్గర బంధువులను లేదా మిత్రులను నేత్రదానం చేయునట్లు ఒప్పించండి. మీ చుట్టు ప్రక్కల ఎవరైనా వ్యక్తి చనిపోతే ఆ వ్యక్తి కుటుంబ సభ్యులను నేత్రదానం చేయునట్లు ప్రోత్సహించండి, నేత్రదానం గురించి, ప్రతి వీధిలో, ప్రతి ఊరిలో, ప్రతి సమాజ సంక్షేమ సమితిలో అన్ని విధాలా ప్రచారం చేయండి. మీరు దీని గురించి ప్రజలకు చెప్పడం వల్ల ఈ ఉద్యమానికి మద్దతు లభిస్తుంది.కంటి బ్యాంక్ యొక్క మిత్రులు అవ్వండి, తరచు కంటి బ్యాంక్ కార్యకలాపాలలో పాల్గొనండి. నేత్రదానం పక్షోత్సవాల (25 ఆగష్టు నుండి 8 సెప్టెంబర్) నిర్వహణలో సహకరించండని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో డోన్ ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది మరియు పేషెంట్లకు, తదితరులు పాల్గొన్నారు.

