NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

కర్నూలు మేయర్, ప్రజాసంఘాల నేతలకు వినతి పత్రాల అందజేత

1 min read

కర్నూలు, న్యూస్​ నేడు:  శ్రీ దామోదరం సంజీవయ్య  పేరును కర్నూలు జిల్లాకు పెట్టాలని దామోదరం సంజీవయ్య జిల్లా సాధన సమితి తరపున కర్నూలు మేయర్ బి వై రామయ్య, ప్రజా సంఘాల నేతలకు వినతి పత్రాలు అందజేసినట్టు సంజీవయ్య జిల్లా సాధన సమితి గౌరవాధ్యక్షులు నక్కల మిట్ట శ్రీనివాసులు తెలిపారు. ఆర్టీఐ బాద్యులు జయన్న,కర్నూలు బహుజన సమాజ్ పార్టీ బాధ్యులు గాడి అరుణ్ కుమార్, బేడ  బుడగ సంఘం నేత మనోహర్ , రాయలసీమ విద్యార్థి పోరాట సమితి నేత రవికుమార్, తదితరులకు జిల్లా సాధన సమితి ప్రధాన కార్యదర్శి దాసరి రామ శేషయ్య, కన్వీనర్ జె. వి.కృష్ణయ్య, గౌరవ సలహాదార దామోదరం రాధాకృష్ణ మూర్తి, సమితి నాయకులు నాగభూషణం,సి. వి. వర్మ, కాంగ్రెస్ పార్టీ నాయకులు పోతుల శేఖర్ తదితరులు  వినతి పత్రాలు అందించారు.

About Author