ఘనంగా గణేష్ నిమజ్జనం వేడుకలు
1 min read

ప్యాపిలి, న్యూస్ నేడు: ప్యాపిలి పట్టణంలో వినాయక చవితి పండుగను భక్తిశ్రద్ధలతో నిర్వహించి వినాయక విగ్రహాలకు మూడు రోజులు భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించి, అన్నదానం కార్యక్రమాలు మరియు ధూప దీప నైవేద్యాలతో పూజలు నిర్వహించి , తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. వినాయక చవితి పండుగను పురస్కరించుకొని శుక్రవారం ప్యాపిలి పట్టణంలోని ఆంజనేయ స్వామి దేవాలయం దగ్గర ఉన్న వినాయక విగ్రహానికి పూజలు యాదవ సంఘం అధ్యక్షుడు గోల్ల రామ్మోహన్ యాదవ్ ఆధ్వర్యంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆయనతోపాటు గోల్ల నరేంద్ర యాదవ్, గోల్ల మద్దిలేటి యాదవ్ తదితరులు కాలనీవాసులు ఘనంగా నిమజ్జనానికి గణేశుని వీధుల గుండా గ్రామోత్సవం నిర్వహిస్తూ యువకులు, పిల్లలు రంగులు చల్లుకుంటూ, బాణసంచాలు కాలుస్తూ గణేష్ పప్పా మోరియా అని గణనాథుని నాదస్వరలతో మార్మురోగుతూ వినాయక స్వామిని నిమజ్జనానికి సాగనంపారు. ఈ సందర్భంగా యాదవ సంఘం అధ్యక్షుడు గొల్ల రామ్మోహన్ యాదవ్ మాట్లాడుతూ తెలుగువారికి మొదటి పండుగ వినాయక చవితి కనుక వినాయకుని మొదటిగా పూజించే పండుగ వినాయక చవితి కనుక ఆయనను పూజిస్తే విఘ్నాలు తొలగుతూ ఆటంకాలు కలగకుండా విజయాలు సాధిస్తామని ,అలాగే ప్యాపిలి పట్టణంలో ప్రజలంతా ఆయురారోగ్యాలతో, సుఖశాంతులతో పాడిపంటలకు కొలువుతిరి ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ జై వినాయకుడికి జై వినాయకునికి జై వినాయక జై అంటూ స్వామివారిని తలిచారు. ఈ కార్యక్రమంలో కాలనీవాసులు, యువకులు, పిల్లలు భక్తులు తదితరులు పాల్గొన్నారు.


