గ్రామ సచివాలయ సిబ్బంది కొరత సమస్యను పరిష్కరించండి…
1 min read

సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా వినతి
హొళగుంద న్యూస్ నేడు: హొళగుంద మండలంలో ఎస్డీపిఐ ఆలూరు అసెంబ్లీ అధ్యక్షులు ఎఫ్.అబ్దుల్ హమీద్ ఆధ్వర్యంలో ఎంపీడీవో విజయ లలిత కు వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఇచ్చిన అనంతరం అబ్దుల్ హమీద్ మాట్లాడుతూఎంపీడీఓ విజయ లలిత కు మా విన్నపం హొళగుంద గ్రామంలో సచివాల సిబ్బంది కొరత ప్రధాన సమస్యగా మారింది .మనం చూసినట్లయితే హొళగుంద గ్రామంలో 4 సచివాలయలు ఉన్నప్పటికీ సచివాల సిబ్బంది మాత్రం 17 మంది మాత్రమే ఉన్నారు. ఒక్క సచివాలయం కి 11 మంది చొప్పున నాలుగు సచావాలయానికి మొత్తం 44 మంది సిబ్బంది ఉండాలి కనీసం పని జరగడానికి అయిన 34 మంది సిబ్బంది అయినాఉండాలి గ్రామ మొత్తానికి 17 మంది మాత్రమే ఉన్నారు. సిబ్బంది కొరత సమస్య ఉండటం వల్ల ప్రజలు చాలా ఇబ్బందికి గురవుతున్నారు 3 వ సచివాలయంలో రెగ్యులర్ ఆధార్ సెంటర్ ఉంది కానీ మిషన్ చెడిపోయిందని ఇప్పటికీ 30 రోజులు అయింది కానీ ఇంతవరకు మిషన్ రిపేర్ కాలేదు దానికి రెగ్యులర్గా సక్రమంగా సాగించడం లేదు రెగ్యులర్ ఆధార్ సెంటర్ గా కొనసాగించాలని లేకపోతే చుట్టుపక్కల గ్రామాల నుంచి ప్రజలు వస్తున్నారు ఇక్కడ చూసినట్లయితే సచివాలయంలో సిబ్బంది ఎవరూ లేకపోవడం వలన రెగ్యులర్ ఆధార్ సెంటర్ లేకపోవడం వలన ప్రజలు చాలా ఆందోళన చెందుతున్నారు రెగ్యులర్ ఆధార్ సెంటర్ ను కొనసాగించాలని కోరుతూ కనీసం ఒక్కో సచివాలయానికి ఒకరు రెగ్యులర్గా ఉండాలి చాలా సందర్భాలలో సచివాలయం డోర్లు ఓపెన్ చేసి ఉన్నప్పటికీ సిబ్బంది మాత్రం తమ తమ ఫీల్డ్ కి వెళ్ళిపోతారు. ఇక్కడ వచ్చిన ప్రజలు ఎవరూ లేకపోవడంతో ప్రజలు చాలా ఆందోళనకు గురవుతున్నారు ఎస్డీపిఐ సోషల్ డెమొక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా తరపున కోరడమేమనగా సచివాల సిబ్బంది కొరత రెగ్యులర్ ఆధార్ సెంటర్ కొనసాగించాలని సమస్యను వెంటనే పరిష్కరించాలని కోరారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ తనయుడు ఈసా. ఆలూరు అసెంబ్లీ ప్రధాన కార్యదర్శి అబ్దుల్. రెహమాన్ కార్యదర్శి హాఫీజ్. కోశాధికారి అల్లా బకాశ్. కమిటీ సభ్యులు అస్లాం .రహమతుల్లా. తదితరులు పాల్గొన్నారు.

