ఏలూరు జిల్లాలో తొమ్మిది బార్లకు గెజిట్ నోటిఫికేషన్ జారీ
1 min read

జిల్లా ఎక్సైజ్ సూపరిoటెండెంట్ ఏ.ఆవులయ్య
ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్ నేడు : జిల్లాలో తిరిగి తొమ్మిది బార్లకు జిల్లా కలెక్టరు వారి ఆమోదంతో గెజిట్ నోటిఫికేషన్ జారీ చేయడం జరిగిందని జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంటు బుధవారం ఎ.ఆవులయ్యా ఒక ప్రకటనలో తెలిపారు. తొమ్మిది బార్లలో ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ లో ఎనిమిది బార్లు అదేవిధంగా జంగారెడ్డిగూడెంలో ఒక బారు మొత్తం తొమ్మిది బార్లకి 3.9.2025 నుండి అప్లికేషన్లు అభ్యర్థులు దాఖలు చేసుకోవచ్చు, అదేవిధంగా సెప్టెంబరు 03 వ తేదీ నుండి అప్లికేషన్లు సెప్టెంబరు 14వ తారీకు సాయంత్రం 6 గంటల వరకు అప్లికేషన్లు ఆన్లైన్ లో దాఖలు చేసుకోవచ్చు లేదా ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఆఫీసు / డిస్ట్రిక్ట్ ప్రోహిబిషన్ & ఎక్సైజ్ ఆఫీసరు శనివారపు పేట ఆఫీస్ నందు ఆప్షన్ లో కూడా దాఖలు చేసుకోవచ్చునని అన్నారు. అదేవిధంగా ఈ అవకాశాన్ని అభ్యర్ధు అందరూ సద్వినియోగం చేసుకొని బార్ లైసెన్స్ పొందాలని కోరారు. అదేవిధంగా అన్ని ఓపెన్ కేటగిరీ బార్స్ జంగారెడ్డిగూడెం లో ఒకటి, ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ లో ఎనిమిది బార్లు సెప్టెంబర్ 14వ తేదీన సాయంత్రం 6 గంటల వరకు అప్లికేషన్స్ తీసుకోవడం జరుగు తుందన్నారు. అదేవిధంగా సెప్టెంబరు 15వ తేదీన ఉదయం 8 గంటలకి ఏలూరు జిల్లా కలెక్టరేటులో జిల్లా కలెక్టరు వారి సమక్షంలో లాటరీ తీసి అభ్యర్థులను ఎంపిక చేయడం జరుగు తుందన్నారు. కావున ఈ విషయం గమనించి బుధవారం నుంచే అప్లికేషన్లు దాఖలు చేసుకోవచ్చని ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఎ.ఆవులయ్యా తెలిపారు.

