NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఏంటి రూ.4 వేలు ఇస్తున్నారు.. మిగతా రెండు వేల  సంగతి ఏమిటి..

1 min read

మహానంది, న్యూస్​ నేడు:  ఏంటి రూ 4,000 ఇస్తున్నారు.. మిగతా 2, 000 రూపాయల సంగతి ఏమిటని డిజేబుల్ పెన్షన్ దారులు ప్రశ్నించినట్లు విశ్వాసనీయ సమాచారం. మండలంలోని ఒక మేజర్ గ్రామపంచాయతీలో పెన్షన్ల పంపిణీ సందర్భంలో ఒక పంచాయతీ కార్యాలయ సిబ్బంది ఒకరు చేతివాటం ప్రదర్శించడానికి ప్రయత్నించగా పెన్షన్ దారులు ఎదురు తిరిగినట్టు తెలుస్తుంది. గత నెలలో తొలగించిన పెన్షన్లను ఈ నెలలో పునరుద్ధరించి తిరిగి మూగ ,చెవిటి, అంధత్వ మరియు వికలాంగులు మరియు మానసిక వికలాంగులకు సంబంధించి పెన్షన్లను ప్రభుత్వం విడుదల చేసింది. అందులో భాగంగానే వారికి అందజేయాల్సిన పెన్షన్లను సాధారణ పెన్షన్లతో పాటు కలిపి ఈనెల 1, 2వ తేదీన అందజేయడం జరిగింది. అందులో భాగంగానే మీ పెన్షన్లను గత నెలలో తొలగించడం జరిగింది. మీరు సరైన పత్రాలు చూపించకపోవడంతో తొలగించడం జరిగిందని ప్రస్తుతం మీకు సెప్టెంబర్ నెలకు గాను 4వేల రూపాయలను అందజేస్తున్నామని మిగతా రెండు వేలు తర్వాత చూద్దామని తొలగించి తిరిగి పునరుద్ధరించిన పెన్షన్ దారులకు తెలియజేయడంతో వారు ఎదురు తిరిగి ఉన్నతాధికారులకు సమాచారం చేరవేస్తామని 6 వేల రూపాయలు ఇవ్వాల్సిందేనని పట్టు పట్టడంతో మరో రోజుకు వాయిదా వేసి తిరిగి చెల్లించినట్లు ఆరోపణలు వినవస్తున్నాయి. గుట్టు చప్పుడు కాకుండా ఒక్కొక్క పెన్షన్ దారుడు నుంచి 2000 రూపాయలు నొక్కేయాలని ప్రయత్నించి విఫలమైనట్లు తెలుస్తుంది. మీ జుట్టు మా చేతిలో ఉందని మరో మారు ఎంక్వయిరీ జరుగుతుందని అప్పుడు మీ పెన్షన్లు ఎలా వస్తాయో చూస్తామని బెదిరించినట్లు తెలిసింది.ఎంపీడీవో వివరణ. మహానంది మండల ఎంపీడీవో దౌలత్ ను వివరణ కోరగా మండలంలో 135 డిజేబుల్ పెన్షన్లను గత నెలలో తొలగించడం జరిగిందని వారందరికీ ప్రస్తుతం పెన్షన్లు  ప్రభుత్వ ఆదేశాల మేరకు పంపిణీ చేయడం జరిగింది అన్నారు. అన్ని రకాల పెన్షన్లను ఇప్పటికే 98 శాతం మండలంలోని వివిధ గ్రామాల్లో తమ సిబ్బంది పంపిణీ చేశారని పేర్కొన్నారు. ఒక మేజర్ పంచాయతీలో సిబ్బంది ఒకరు ₹2, 000 డిజేబుల్ పెన్షన్ దారుల నుండి నొక్కేయాలని చూడడం లేదా ప్రయత్నించినట్లు తమ దృష్టికి రాలేదన్నారు. అలాంటిది ఏవైనా ఉంటే చర్యలు తప్పవని అన్నారు.

About Author