NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ ఉత్పత్తులకు పెద్దపీట వేస్తుంది

1 min read

భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్

ప్రధానమంత్రి కౌశల్య యోజన పేరుతో 18 ఉత్పత్తులకు శిక్షణ ఇవ్వటం జరుగుతుంది

ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్​  నేడు : ఆరోగ్య శ్రీ,ఆయుష్మాన్ భారత్ అనుసంధానం తో వైద్య సేవలు అందుబాటులో కి వస్తాయి త్వరలో వైద్య ఆరోగ్య శాఖ ప్రకటన చేస్తుంది . ప్రపంచంలో నే జూట్ ఉత్పత్తులు ప్రమాదం లో ఉన్నాయి.ఏలూరు జూట్ పరిశ్రమ మూత పడడంపై బిజెపి రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ స్పందించారు. బుధవారం ఏలూరులోని బిర్లా భవన్ సెంటర్ లో జరిగిన ఛాయ్ పే చర్చ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు.జూట్ పరిశ్రమను ఆదుకోవాలి అంటే ప్లాస్టిక్ మిక్స్ డ్ ఉత్పత్తులు వల్ల  సాంప్రదాయ జూట్ పరిశ్రమకు నష్టాలు వచ్చాయి.కేంద్ర ప్రభుత్వం వ్యసాయ ఉత్పత్తులు కు పెద్దపీట వేస్తుంది.రైస్ నుండి తారు విటమిన్ తయారు కు ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్న విషయం కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ముఖ్య మంత్రి చంద్రబాబు కు స్వయంగా చెబితే ముఖ్య మంత్రి ఆశ్చర్యం వ్యక్తం చేసి ఆదిశగా ఆలోచన చేస్తామని ముఖ్యమంత్రి చెప్పారని మాధవ్ వివరించారు.పామాయిల్, కోకో, కొబ్బరి రైతు లను ఆదుకుంటాం.ఏలూరు నిమ్మ మార్కెట్ కి ప్రసిద్ధి అందుకు అనుగుణంగా ప్రాసెసింగ్ యూనిట్లు రావాల్సిన అవసరం ఉంది.సూక్ష్మ ఆహారశుద్ధి పరిశ్రమలకు కేంద్రం సహాకారం అందిస్తోంది. ప్రొఫెషనల్ కోర్సులు చేసిన యువత నిరిద్యోగులు గా మారడం ఆందోళన కలిగిస్తోంది.అందుకే కేంద్రం స్కిల్ యూనివర్సిటీ లను తీసుకుని వచ్చింది. ప్రధానమంత్రి కౌశల్య యోజన పేరు తో 18 వృత్తులు కు శిక్షణ ఇవ్వడం జరుగుతోంది.ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన పథకం ద్వారా యువతకు అవకాశాలు. విశాఖలో ఒక స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేయడమైనది.కేంద్ర ప్రభుత్వం తీసుకుని వచ్చి న నూతన విద్యా విధానం తో ఆదిలోనే నిరిద్యోగ సమస్య పరిష్కారం అవుతుందని ఛాయ్ పే చర్చ లో మాధవ్ వివరించారు.ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్పూర్తి తో సారథ్యం యాత్ర చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు తపన చౌదరి, బిజెపి జిల్లా అధ్యక్షులు చౌటపల్లి విక్రమ్ కిషోర్, బిజెపి నాయకులు అంబిక కృష్ణ, తదితర బిజెపి నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

About Author