NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

వినాయక నిమజ్జనోత్సవంలో..వైసీపీ సేవ..

1 min read

కర్నూలు, న్యూస్​ నేడు :మత సామరస్యానికి ప్రతీకగా నిలిచే కర్నూలులో వినాయక నిమజ్జనోత్సవం గురువారం అంగరంగ వైభవంగా  జరిగింది.  ఇందులో భాగంగా వైఎస్సార్సీపీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు,  కర్నూలు మాజీ ఎమ్మెల్యే ఎంఏ హఫీజ్​ ఖాన్​ భక్తులకు తాగునీరు అందించి.. అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు.  హఫీజ్​ ఖాన్​ నేతృత్వంలో గత 14 సంవత్సరాలుగా ప్రజలకు సేవ చేస్తూ, ప్రేమ, స్నేహం, సౌహార్ధతతో అన్ని పండుగలను కలిసి జరుపుకోవాలనే సంకల్పంతో ఇలాంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. గురువారం నిమజ్జనోత్సవం సందర్భంగా కింగ్ మార్కెట్ , బుధవారం పేట్ వద్ద  భక్తులకు అన్నదానం కార్యక్రమం చేశారు. భవిష్యత్​ లోనూ సేవా కార్యక్రమాలు కొనసాగిస్తామన్న హఫీజ్​ ఖాన్​… కర్నూలు నగరంలో ఐక్యత, సౌభ్రాతృత్వం మరింత బలపడేందుకు కృషి చేస్తామన్నారు.

About Author