సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేసిన పత్తికొండ ఎమ్మెల్యే
1 min read

పత్తికొండ, న్యూస్ నేడు : సీఎం రిలీఫ్ ఫండ్ కింద మంజూరైన చెక్కులను స్థానిక ఎమ్మెల్యే కేఈ శ్యాం కుమార్ శనివారం తన క్యాంపు కార్యాలయంలో బాధితులకు పంపిణీ చేశారు. సాయం కోసం దరఖాస్తు చేసుకున్న 9 మంది బాధితులకు ముఖ్యమంత్రి సహాయనిధి కింద రూ. నాలుగు లక్షల 81 వేల రూపాయలు మంజూరైంది. అందుకు సంబంధించిన చెక్కులనుపత్తికొండ ఎమ్మెల్యే కే ఈ శ్యామ్ కుమార్ స్థానిక ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేఈ శ్యామ్ కుమార్ మాట్లాడుతూ, కష్టకాలంలో కుటుంబానికి పెద్దకొడుకుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అండగా ఉంటున్నారని అన్నారు. సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందుకున్న లబ్ధిదారులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు, ఎమ్మెల్యే కేఈ శ్యామ్ కుమార్ కు కృతజ్ఞతలు తెలిపారు.

