ఉచిత బస్సు పథకంతో ఉపాధి కోల్పోయిన ఆటో కార్మికులను ఆదుకోవాలి
1 min read

సిఐటియు మండల కార్యదర్శి యం. రవిచంద్ర
పత్తికొండ, న్యూస్ నేడు: రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు పథకం తీసుకురావడంతో ఆటో కార్మికులు అత్యధిక సంఖ్యలో ఉపాధి కోల్పోయారని వారిని ప్రభుత్వం ఆదుకోవాలని సిఐటియు మండల కార్యదర్శి యం. రవిచంద్ర కోరారు. ఈ మేరకు శనివారం పత్తికొండ పట్టణంలోని స్థానిక మారెళ్ళ ఆటో స్టాండ్ నుండి నాలుగు స్తంభాల కూడలి వరకు ఆటో కార్మికులు ర్యాలీగా వచ్చి అక్కడ రాస్తారోకో చేపట్టారు. ప్రజానాట్మండలి జిల్లా నాయకులు పి. కాసిం అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఈ ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ఉచిత బస్సు పథకం తీసుకురావడం వల్ల మహిళలకు ఉపయోగమున్నా ఆటో కార్మికుల ఉపాధి మాత్రం గల్లంతైందని ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం ఆటో కార్మికుల సంక్షేమం కోసం సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని ఎన్నికల ముందు వాగ్దానం చేసిందని అధికారం వచ్చిన వెంటనే ఆ వాగ్దానాన్ని మరిచారన్నారు. వెంటనే ఆటో కార్మికులకు సంక్షేమ బోర్డును ఏర్పాటు చేసి, ఇన్సూరెన్స్ పెన్షన్ బ్యాంకు రుణాలు అందించాలన్నారు. అలాగే ఆటో కార్మికుల కోసం ఆటో ఉన్న ప్రతి ఒక్కరికి 25 వేలు సంవత్సరానికి భృతి కల్పించాలని సమగ్ర చట్టాన్ని రూపొందించి వాహన మిత్ర అమలు చేయాలన్నారు. అలాగే రవాణా చట్టం ద్వారా విపరీతమైన చలానాలను విధించకూడదు అన్నారు.ఏటీసీని ఎత్తివేసి ఆటో కార్మికులకు కాలనీలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం ఆర్డీవో కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి ఆర్డీవో కార్యాలయంలో ఉన్న అధికారి ఈరమ్మకు, డిమాండ్ పత్రం అందించారు. ఈ కార్యక్రమంలో. ఆటో కార్మిక సంఘం అధ్యక్ష కార్యదర్శులు మురుగన్, శేఖర్, వ్యవసాయ సంఘం మండల కార్యదర్శి నరసన్న, డివైఎఫ్ఐ మండల నాయకులు డి.అల్లిపిర, భవన నిర్మాణ కార్మిక సంఘం నాయకలు తదితరులు పాల్గొన్నారు.

