ఆపదలో ఉన్న వారికి అండగా నిలిచిన వేలేరుపాడు పోలీసులు
1 min read

మానవత్వం చాటుకున్న వేలేరుపాడు ఎస్సై శ్రీనివాస్
ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్ నేడు : ప్రతినిధి పోలీస్ అధికారులు ఉద్యోగ నిర్వహణలో కఠినంగా ఉంటారని పేరున్నప్పటికీ, ఆపదలో ఉన్న వారికి సహాయం అందించడంలో ముందుంటామని వేలేరుపాడు ఎస్ఐ శ్రీ నవీన్ నిరూపించారు.శుక్రవారం సాయంత్రం వేలేరుపాడు మండలం రేపాకగొమ్ము గ్రామంలో ప్రమాదవశాత్తు ఇల్లు కాలిపోయి సర్వం కోల్పోయిన తెల్లం బాయమ్మ కి వేలేరుపాడు పోలీస్ వారి తరఫున నిత్యావసర సరుకులను ఎస్ఐ మరియు వారి సిబ్బంది అందజేశారు.పోలీసులు చేసిన ఈ తక్షణ సహాయానికి ప్రజలు వారిని అభినందించారు. ఈ అందించిన సహాయానికి ప్రజలకు మరియు పోలీసులకు మధ్య ఉన్న సంబంధాన్ని మరింత బలపరుస్తుందని పలువురు కొనియాడారు. ఈ చర్య ద్వారా పోలీసులు కేవలం చట్టాన్ని అమలు చేసేవారే కాదు, సామాజిక బాధ్యత కలిగిన మానవతావాదులు అని మరోసారి రుజువైంది.

